Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

”దోమ మలేరియను” తరిమి కొట్టండి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

-పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి
-ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ దేవిరాజశ్రీ,
రమ్యశ్రీ

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:

 

రాయవరం ,విశ్వం వాయిస్ః

ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భముగా సోమవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డా. ఎ. దేవిరాజశ్రీ, డా. హెచ్.రమ్యశ్రీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోమల ద్వారా ముఖ్యంగా ఐదు రకాలైన వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయని, అవి మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికున్గున్యా, మెదడువాపు వ్యాధి అని తెలిపారు. వీటిని రాకుండా నివారించేందుకు గాను ఇంటి పరిసరాల్లో దోమలు ఆవాసాలను ముందుగా నిర్మూలించాలని అన్నారు. దోమలు ఎక్కువగా ఇంటి పరిసరాల్లోని నీటి ఆవాసాలలోనూ, ఇంటిలో నిల్వలు వున్న ప్రదేశాల్లో గుడ్లు పెట్టడం ద్వారా దోమల పెరుగుదలకు అవకాశాలు కలిపిస్తున్నాం అన్నారు. రోగులు బారిన పడకుండా ఇంటి పరిసరాలలో నీటి గుంటలు లేకుండా చూసుకోవాలని, ఇంటి లో నీటి నిల్వలపై తప్పనిసరిగా మూతలతో గానీ క్లాత్తో కానీ కప్పి ఉంచడం ద్వారా దోమలు నీటిలో గుడ్లు పెట్టడాన్ని నివారించవచ్చును అని తెలిపారు. ఇంటిలో మానము వాడుకునే ఫ్రిజ్ వెనుక భాగంలో నీరు చేరి ఉంటుందని, దాంట్లో కూడా దోమల గుడ్లు పెట్టి దోమల పెరుగుదలకు అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటి కప్పుడు శుభ్రం చేసుకోవాల్సిందిగా సూచించారు. దోమ కాటు నుండి రక్షణ పొందటానికి గానూ సంధ్యావేళ సమయంలో ఇంటి తలుపులు, కిటికీలను మూసి ఉంచుకోవాలని, వేప ఆకు పొగ , కాళ్లు, చేతులను పూర్తిగా కప్పి ఉంచే వస్త్రాలను ధరించడం, దోమతెరలను వాడటం, దోమ కాటు నుండి రక్షణ పొందవచ్చని తెలియజేశారు.
నీటి నిల్వలలో ఎబ్బేట్ స్ప్రేయింగ్ చేయడం ద్వారా దోమల లార్వాలను అంతం చేయవచ్చునుఅన్నారు. ఇళ్లలో పైరిథ్రిమ్ స్ప్రేయింగ్ ద్వారా పెద్ద దోమలను, దొమ నిర్మూలన మందును (మలాథియాన్ ) ఫాగింగ్ చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ప్రదేశంలోని
దోమలనుపూర్తిగా నివారించవచ్చని తెలిపారు. ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియా వ్యాధి భారాన్ని తగ్గించడానికి, జీవితాలను రక్షించడానికి ఆవిష్కరణలను ఉపయోగించుకోండి. అనే నినాదాన్ని ఇవ్వడం జరిగిందని అన్నారు. మలేరియా కు పూర్తి స్థాయి చికిత్స ఉందని ఎవరికైనా జ్వరలక్షణాలు ఉన్నట్లయితే ఆరోగ్య సిబ్బందికి వెంటనే తెలియపర్చాలని, వారి రక్త నమూనాలను సేకరించి,వ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందని వారు అన్నారు.ఆరోగ్య సిబ్బంది, సచివాలయం సిబ్బంది, ప్రతివారం శుక్రవారం డ్రైడే ఫ్రైడే నిర్వహించి, దొమ ఆవాసాలను నిర్మూలించటం, అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అయితే ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రజల సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ డికృష్ణ శేఖర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీమతి వాణి కుమారి, హెల్త్ సూపర్వైజర్ జే.శంకర్, ఎన్. విజయలక్ష్మి , హెల్త్ అసిస్టెంట్స్ కె.వెంకటేశ్వరరావు, పి. భాస్కర్, ఎం ఎన్ ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement