రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్:విద్యతోనే ఉజ్వల భవిత ఉంటుందని రాయవరం ఎంపీపీ నౌడు వెంకటరమణ పేర్కొన్నారు.
మండల కేంద్రమైన రాయవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రిన్సిపాల్ ఎం.రామారావు ఆధ్వర్యంలో ఎంపీపీ నౌడు వెంకటరమణ, గ్రామ సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ అధ్యక్షతన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాయవరం గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ తెదేపా సీనియర్ నాయకులు వుండవిల్లి రాంబాబు ముఖ్య అతిథిలుగా పాల్గొని మాట్లాడుతూ విద్యా వ్యవస్ధలో విప్లవాత్మకమైన మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రైవేటు విద్యా సంస్ధలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్ధలను అభివృద్ధి పరుస్తుందన్నారు. విద్యార్ధులు బాగా చదువుకొని ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు పొంది తద్వారా తమ కుటుంబాలను బాగా చూచుకోవాలన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్ధుల హజరుశాతం, ఫలితాల మెరుగుదలకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు.
స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లను, వాటిలో ఉండే సమాచారాన్ని సద్వినం చేసుకోవాలని వాటి వల్ల మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుందని, మంచిని గ్రహించి చెడుకు దూరంగా ఉండాలని తెలిపారు. నేడు గొప్పవాళ్లుగా ఎదిగిన ఎందరో మహానుభావులందరూ ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు అన్నారు. డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలని తపన కలిగి ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులు వారిపై పెట్టుకున్న ఆశలు నెరవేర్చాలని వారన్నారు.
అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనాన్ని కళాశాల విద్యార్థులకు స్వయంగా వడ్డించి వారితోపాటు కలిసి భోజనాలు చేసి భోజనం యొక్క నాణ్యతను పరిశీలించి మధ్యాహ్నం భోజన పథకాన్ని అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ లు పి.రామలక్ష్మణమూర్తి, వై సూర్యనారాయణ, శ్రీ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి.శాంతి సునీత, స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ దేవిశెట్టి.కోటేశ్వరరావు(చిన్ని), కళాశాల అధ్యాపక సిబ్బంది, కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
33