విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం( విశ్వం వాయిస్)
కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా మరియు ఎస్పి సుబ్బారెడ్డి గురువారం అమలాపురం కార్యాలయాలలో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ జియం హరీష్ బాలయోగి మర్యాద పూర్వకంగా కలిశారు..ఈ సందర్భంగా ఎదుర్లంక – యానాం బ్రిడ్జిపై ఇటీవల ఎక్కువ ప్రమాదాలు జరుతున్నాయని కావునా తగు చర్యలు తీసుకుని పరిష్కార మార్గాలు చూడాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు.వారితోపాటుగా చిక్కాల గణేష్ ,గంధం పల్లంరాజు ,చెరుకూరి సాయిరాం ,ఆశెట్టి ఆదిబాబు,చిక్కాల రాంబాబు ,గోకరకొండ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.