విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాపీలేశ్వరపురం:
కపిలేశ్వరపురం మండలం (విశ్వం వాయిస్ )నల్లూరు గ్రామానికి చెందిన వేగుళ్ళ పెద్ద వీర్రాజు, స త్యానందం దంపతులు వారి కుమారుడు ప్రభాకర చౌదరి ఆరు సెంట్లు స్థలం రైతు భరోసా కేంద్రానికి విరాళంగా అందజేశారు.21 లక్షల 80 వేలు రూపాయలు అంచనాతో గ్రామంలో నిర్మించ తలపెట్టిన రైతు భరోసా కేంద్రానికి స్టల అన్వేషణలో వుండగా వేగుల్ల ప్రభాకర చౌదరీ మెయిన్ రహదారి ప్రక్కన గల తన 6 సెంట్లు సొంత స్థలం ఉచితంగా ఇచ్చుటకు ముందుకు వచ్చారు. వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ ప్రభాకర్ చౌదరి తన వైద్య సేవలు ద్వారా గ్రామస్తుల మన్ననలు పొందారు అని పలువురు వక్తలు కొనియాడారు.ఆయనకు గ్రామ పెద్దలు, వైసీపీ నాయకులు పుట్టా కృష్ణబాబు,సర్పంచ్ ఉదయ శ్రీ రాంబాబు, జెడ్పీటీసీ సభ్యుడు అబ్బు, మార్నిపూసబ్బు, ఎంపిడిఓ వెంకట్రామన్,తహశీల్దార్ చిన్నా రావు, ఈ ఓ పి ఆర్ డి రామ కృష్ణ రెడ్డి , జే ఈ రాఘవులు,గ్రామ కార్యదర్శి ఎస్.రామకృష్ణ, వి ఆర్ ఓ రామారావు తదితరులు ఘనంగా సత్కరించారు.