విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అల్లవరం:
అల్లవరం విశ్వం వాయిస్: మండలంలోని తాడికొన గ్రామ పంచాయితీ పరిధిలో పెదపేట గ్రామానికి అనుకోని నివాస ప్రాంతాల ప్రక్కన చెరువు తవ్వకాలను నిలుపుదల చేయాలంటూ మంగళవారం అల్లవరం తాహిశీల్ధార్ కు ఫిర్యాదు చేశారు. నివాస ప్రాంతాల పక్కన చెరువులు తవ్వడం వల్ల తాగునీరు కలుషితమై పంట పొలా లు,పంట కాలువలు ఉప్పు నీటి కాలువలుగా మరిపోతాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.గత కొన్ని సంవత్సరాల నుండి గ్రామంలో ఉన్న మంచినీటి చెరువును నిత్యావసరాలకు,పశువులకు, ఉపయోగించుకుంటున్నామని ఉప్పునీటి చెరువు తవ్వకాలు వలన గ్రామంలో ఉన్న మంచి నీటి చెరువు కాస్త ఉప్పు చేరువుగా మరిపోతుందని,ఆగ్రహ వ్యక్తం చెందుతున్నారు. చెరువు తవ్వకాలను నిలుపుదల చేయాలలంటూ తాహిశిల్దార్ కు ఉండ్రు వెంకటరత్నం,దాసరి నాగరాజు, పల్లి గాలిదేవుడు, దాసరి భూలోకం, దాసరి శ్రీరామకృష్ణ,మాకే బాలరాజు, ప్రకాష్ రావు తదితరులు ఫిర్యాదు చేశారు.