సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం (విశ్వం వాయిస్)
మన్యం విప్లవ వీరుడు స్వాతంత్ర సమర యోధుడు
అల్లూరి సీతారామరాజు 98వ వర్ధంతి సందర్బంగా కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడి గ్రామంలో సిపిఎం పార్టీ ప్రజాసంఘాల ఆద్వర్యంలో ఆయన విగ్రహనికి పూలమాల వేసి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది ఈకార్యక్రమంలో సిపిఎంపార్టీ కార్యదర్శి కారెంవెంకటేశ్వరరావు కెవిపిఎస్ జిల్లా కన్వీనర్ పి వసంతకుమార్ భవననిర్మాకార్మిక సంఘం కార్టదర్శి భీమాలశ్రీను బి రమేష్ పి శ్రీను పరమటశ్రీను కందేరి వెంకట రమణ తదితరులు పాల్గోన్నారు ఈ సందర్భంగా సిపిఎంపార్టీ కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు కేవిపిఎస్ జిల్లా కన్వీనర్ పి వసంతకుమార్ లు మాట్లాతూ. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్య వాదులకు వ్యతిరేకంగా గిరిజనులను ఐక్యం చేసి సాయుధ పోరాటం నడిపారని గుర్తుచేశారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు నడిపిన మన్య విప్లవ పోరాటం నేటికీ దేశ స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉందన్నారు. అయితే నేటి పాలకులు దేశ స్వాతంత్ర్యాన్ని అమెరికన్ సామ్రాజ్యవాదులకు, బడా కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టారని విమర్శించారు. అల్లూరి స్ఫూర్తితో రైతులు, వ్యవసాయ కార్మికులు కార్మికులు బడుగుబలహీన వర్గాలప్రజలు తమ సమస్యలపై పోరాటాలకు సమాయాత్తం కావాలని పిలుపునిచ్చారు కేంద్రప్రభుత్వం ఒకప్రక్క ప్రైవేటీకరణ సరళీకరణ విధానాలు అవలంబిస్తూనే మరో ప్రక్క మతోన్మాద విదానాలను ప్రజలపై రుద్దతుందన్నారు ఈ ఫాసిస్టు మతోన్మాద విదానాలపై మరో స్వాతంత్ర పోరాటానికి సిద్దంకావాలని వారు పిలుపునిచ్చారు.