విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమరావతి:
అమరావతి, విశ్వం వాయిస్ః
మనిషి తన ఆలోచనలకు పదును పెట్టాడు.. తెలివి తేటలతో ఆధునిక సాంకేతిక సాధనాలతో … అంతరిక్షంలో విహరిస్తున్నాడు.. నక్షత్రాలను లెక్కిస్తున్నాడు.. సముద్ర లోతుని కొలుస్తున్నాడు..కానీ మనిషిగా మాత్రం సాటి మనిషి మీద కరుణ చూపించడం మరచిపోయాడు. మేము మనది అనే నేచర్ నుంచి నేను నాది అనే స్టేజ్ కు చేరుకున్నాడు.. అందుకనే బంధాలన్నీ వ్యాపార బంధాలుగా మారిపోయాయి. రక్త సంబంధం, భర్య భార్యాభర్తల బంధం ఇలా అన్ని బంధాలు అవసరాలకు అనుగుణంగా మారిపోతున్నాయి.. మానవత్వం ఎక్కడా అన్నచందంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి.. తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లా.. మచిలీపట్నంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మచిలీపట్నంలో బుధవారం రాత్రి అన్నెం సౌజన్య అనే వివాహిత మరణించింది. భార్య మరణ వార్త తెలిసినా భర్త.. చివరి చూపుకు రాలేదు.. అంత్యక్రియలు చేయాలనీ భావించలేదు.. ఇక అయినవారు కూడా ఎవరూ సౌజన్య మృత దేహాన్ని కూడా చూసేందుకు రాలేదు. ఈ విషయం తెలుసుకున్న అంగన్వాడీ కార్యకర్తలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాత్రంతా అనాథ శవంలా ఉండిపోయిన భౌతిక కాయానికి అంత్యక్రియలు చేయడానికి ముందుకొచ్చారు.అంగన్వాడీ కార్యకర్తలు మానవత్వం చాటుకుంటూ.. సౌజన్యకు అన్నీ తామై అంతిమ యాత్రను నిర్వహించారు. సౌజన్య పార్ధీవ దేహాన్ని స్మశానికి తరలించానికి పాడెను కూడా మహిళలే మోశారు. అంగన్వాడీ కార్యకర్తలు స్మశానవాటికలో దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహించారు.