కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పెదపూడి:
( విశ్వం వాయిస్ న్యూస్ ) పెదపూడి
ఈరోజు పెదపూడి మండలం దోమాడ గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి వారిని అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మరియు వారి సతీమణి ఆదిలక్ష్మి దంపతులు దర్శించుకుని అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా దూనే అప్పారావు, కమిటీ సభ్యులుగా బొండాడి అప్పాయమ్మ, ఎర్లగడ్డ సుబ్బరాజు, మీనవల్లి సత్యవేణి, చీపూరి గోవిందరాజులు, లవేటి లక్ష్మి, యామల అక్కాయమ్మ, పెద్దింటి వేణుగోపాలాచార్యులు శాసన సభ్యులు వారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం శాసనసభ్యులు వారు మాట్లాడుతూ పాలక మండలి కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధి కొరకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పేప కాయల వెంకటలక్ష్మి వెంకటరమణ, ఎంపీపీ కేతా తులసి శ్రీనివాస్, శెహాపురం ఎంపిటిసి పార్వతి వెంకటరమణ, వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి అద్దంకి ముక్తేశ్వరరావు, పెదపూడి మండలం వైస్ ఎంపీపీ కరెడ్ల వెంకన్నబాబు, సర్పంచ్ సత్తిబాబు, పెదపూడి భద్రం, చీపూరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.