విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
( విశ్వం వాయిస్ న్యూస్ )
కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా డా.ఏ. హనుమంత రావు భాద్యతలు స్వీకరణ.
కాకినాడ : కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డా.ఎ. హనుమంతరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు . డి.ఎమ్.హెచ్.ఓ కార్యాలయంలో మీటింగ్ హాల్ నందు ప్రస్తుత డి.ఎమ్.హెచ్.ఓ డా.బి.మీనాక్షి బదిలీపై శ్రీకాకులం డి.ఎమ్.హెచ్.ఓ గా వెళ్తున్న సందర్భంగా వీడ్కోలు మరియు సత్కారము అలాగే కొత్తగా డి.ఎమ్.హెచ్.ఓ గా బాధ్యతలు స్వీకరించిన ఏ.హనుమంత రావు స్వాగత సత్కారం ఏర్పాటు చేసినారు . డి.ఎమ్.హెచ్.ఓ. డా. ఏ.హనుమంత రావు మాట్లాడుతూ మాతృ మరణాలు శిశు మరణాలు తగ్గించే దిశగా , ఆసుపత్రి ప్రసవాలు మరియు ప్రభుత్వంచే నిర్దేశించబడిన అన్నీ ఆరోగ్య కార్యక్రమాలు నూటికి నూరు శాతం సాదించే దిశగా పనిచేస్తూ అందరి సహాయ సహకారములతో ప్రజలకు మెరిగైన వైద్య సేవలు అందించాలని తెలియజేశారు. బదిలీపై వెళ్తున్నా డా.బి. మీనాక్షి సేవలను కొనియాడారు . ఈ కార్యక్రమములో జిల్లా ప్రోగ్రాం అధికారులు మెడికల్ ఆఫీసర్లు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ను డా.హనుమంతరావు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుశ్చo అందించారు.