Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మీ సేవలు అద్వితీయం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఆలమూరు సర్సులు ను సన్మానిస్తున్న
మండలం వైయస్సార్సీపి కన్వీనర్ గ్రామ సర్పంచ్ తమ్ముడు
శ్రీనివాసు.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:

 

ఆలమూరు (విశ్వం వాయిస్ న్యూస్) మీ సేవలు అద్వితీయమని. మీ సేవలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలమని ఆలమూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్, చెముడులంక సర్పంచ్ తమ్మన శ్రీనివాసు కొనియాడారు. ప్రతి ఏటా మే 12వ తేదిన జరిపే అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఆలమూరు మండలం చెముడులంక గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న నరుసమ్మలను దుశ్శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యరంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని, ప్రజల ఆరోగ్యరక్షణలో నర్సులు అందించిన తోడ్పాటును ఈ దినోత్సవం రోజున గుర్తుచేసుకోవాలని అన్నారు. కరోనా కరాళ నృత్యం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా వైద్యులతోపాటు, నర్సులు రోగులకు ఎంతో సేవలు చేశారని వారి సేవలను ప్రతి ఒక్కరూ కొనియాడాలని అన్నారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనే విషయంలో నర్సులు ముందంజలో ఉంటూ గొప్ప సంకల్పాన్ని చూపించారని వారి సేవలను బాధితులు ప్రశంసించారని, ఆలమూరు ఆసుపత్రి ( సీ.హెచ్.సీ) లోనూ, చొప్పెల్ల, పెద్దపళ్ళ పి.హెచ్.సిలలోనూ కరోనా, సాదారణ బాధితులకు నిత్యం సేవలు చేస్తున్న వైద్య సిబ్బందిలో నర్సుల పాత్ర చాలా కీలకమని, మండలంలోని ప్రతీ ఒక నర్సు కరోనా సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ వారు సేవలను అందిచిన తీరుపట్ల వారికి విపరీతమైన గౌరవాన్ని, విపత్కర పరిస్థితుల్లో వారి ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తుందని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యరంగాల్లో విశేషమైన సేవలందిస్తున్న నర్సులందరికి శుభాకాంక్షలని అన్నారు. ఈ కార్యక్రమంలో దొండపాటి వీర వెంకట్రావు (చంటి), మాజీ సర్పంచ్ బి వీరవెంకటరావు, దొండపాటి వెంకటేశ్వరరావు (బుల్లిరెడ్డి), దొండపాటి శ్రీను, మోటూరి సురేష్, బొర్రా వీరబాబు, సుంకర శ్రీనివాసు, సచివాలయ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement