విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వరపురం:
కపిలేశ్వరపురం మండలం (విశ్వం వాయిస్)
తుఫాన్లు ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు గత ఖరీఫ్ పంట ఆలస్యం అయ్యిందని దాని వలన ఈ రబీ సీజన్ 20 రోజులు ఆలస్యం అయ్యిందని కపిలేశ్వరపురం మండల వ్యవసాయధికారి రమేష్ కుమార్ తెలిపారు. కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామం రైతు భరోసా కేంద్ర0 వద్ద వచ్చే ఖరీఫ్ పంట సాగు పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ యేడాది ఖరీఫ్ త్వరగా ప్రారంభించా లనే ఉద్దేశ్యంతో జూన్ నెల మొదటి వారంలో కాలువలకు నీరు విడుదల చేస్తారని ఏ ఓ రమేశ్ కుమార్ తెలిపారు. ఖరీఫ్ లో స్వల్పకాలిక పంట సాగు చేస్తారని అందువలన అక్టోబర్ 30 లోగా సీజన్ పూర్తి అవుతుందని ఏ ఓ తెలియచేశారు. వెంటనే రబీ సీజన్ ప్రారంభిస్తే తర్వాత యేడాది మార్చి ఆఖరకు సీజన్ పూర్తి అవుతుందని అన్నారు. మార్చి ఆఖరకు రబీ సీజన్ పూర్తి అయితె మూడవ పంటగా అపరాలు సాగు ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు అన్నారు. అదనపు ఆదాయం తో పాటు అపరాలు సాగు వలన సహజసిద్దమైన నత్రజని భూమి కి అందుతుందని ఆయన అన్నారు. పంట మార్పిడి విధానం అమలు వలన భూసారం పెరుగుతుందన్నారు. రైతులు రసాయనిక ఎరువులు తగ్గించి, సేంద్రీయ ఎరువులు వాడకం ద్వారా ఖర్చులు తగ్గి ఆరోగ్య కరమైన పంట ఉత్పత్తి అవుతుంది అన్నారు.ఖరీఫ్ విత్తనాలు కావలసిన వారు ముందుగా గ్రామ రైతు భరోసా కేంద్రం వద్ద తెలపాలని ఏ ఓ రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుక్కల నాగమణి, పి ఏ సీ ఎస్ చైర్ పర్సన్ మట్టపర్తి పాలరా జు, ఉమ్మడిశెట్టి సూరి బాబు, ఉప సర్పంచ్ రాంబాబు, ఏ ఈ ఓ లక్ష్మీ, ఏ ఓ హరిబాబు, గ్రామ వ్యవసాయ సలహా మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.