వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ యనమదల
నాగేశ్వరరావు పంచాయతీ రాజ్ జేఈ డి వీరభద్రరావు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:
ఆలమూరు( విశ్వం వాయిస్ న్యూస్):
స్నానాల రేవుల నిర్మాణాలు పారదర్శకంగా ఉండాలని ఆలమూరు వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ యనమదల నాగేశ్వరరావు అన్నారు. కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి తూర్పు డెల్టా ప్రధాన కాలువపై సుమారు రూ.5 లక్షల పంచాయతీ నిధులతో నిర్మిస్తున్న స్నానాల రేవు నిర్మాణ పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. పంచాయతీ రాజ్ జేఈ డి వీరభద్రరావు, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ రెహమాన్ రేవు నిర్మాణాలకు కొలతలు నిర్ణయించారు. అధికారులు నిర్ణయించిన కొలతల ప్రకారం నిర్మాణపు పనులు చేయాలని గ్రామ సర్పంచ్ యూ లక్ష్మి మౌనిక కోరారు. మే 26వ తేదీనాటికి భూమి (ఫ్లోరింగ్) పనులు పూర్తిచేయాలని జేఈ కాంట్రాక్టర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో మల్లెమొగ్గలు చిన్న, పలువురు నాయకులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు