విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ ( విశ్వం వాయిస్ న్యూస్ )
కాకినాడ, మే30; కార్మికవర్గ రాజ్యస్థాపనకై, దోపిడీ రహిత సమ సమాజ స్థాపనకై కార్మిక, కర్షక ఐక్యత అనివార్యమని, పెట్టుబడిదారీ విధానానికి సోషలిజమే మాత్రమే ప్రత్యామ్నాయమని అందుకు వర్గ పోరాటాలే మార్గమని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి తెలిపారు.
సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కాకినాడ కచేరిపేట సిఐటియు కాకినాడ జిల్లా కార్యాలయమైన కా. పి.లక్ష్మీదాస్ భవన్ వద్ద జెండా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి. బేబి రాణి అరుణ పతాకావిష్కరణ చేసారు. అనంతరం సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కా. బి.టి. రణదివె చిత్రపటానికి కా. కె. సత్తిరాజు, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కా. పి. రామ్మూర్తి చిత్ర పటానికి కా. చంద్రమళ్ళ పద్మ లు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు.
ఈ సందర్భంగాబేబిరాణి, రాజ్ కుమార్ లు మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం కార్మికవర్గాన్ని పాలకవర్గాలు అనేక చీలికలు చేసారని, ఐక్య పోరాటాలను ముందుకు తీసుకెళ్లేందుకు సీఐటీయూ 1970 మే 30 ఏర్పాటుచేసి నేటికి 52 సంవత్సరాలు పూర్తయ్యిందన్నారు. సీఐటీయూ ఏర్పాటు అనంతరం మరొక చీలిక కార్మికవర్గంలో రాలేదని, 1991 నూతన ఆర్ధిక విధానాలను (సరళీకరణ, ప్రేవేటికరణ, ప్రపంచీకరణ) స్వాగతించిన కార్మిక సంఘాలుకుడా నేడు అవే విధానాలకు వ్యతిరేకంగా సిఐటోయుతో కలిసి ఐక్య పోరాటాలు చేస్తున్నాయని, ఇది కార్మికవర్గం ఎడతెరిపిలేకుండా చేసిన 21దేశవ్యాప్త సమ్మెల ఫలితమేనని తెలిపారు. నేడు మోడీ ప్రభుత్వం 8ఏళ్ల పాలనలో పెట్రోల్,డేసిల్,గ్యాస్ ధరలు పెంచడం, విద్యుత్ కోతలవల్ల పరిశ్రమలు మూతబడి కార్మికుల ఉపాధి పోవడం, దేశచరిత్రలో అత్యధిక నిరుద్యోగులుగా యువత మిగిలిపోవడం మినహా దేశ ప్రజలకు దక్కిందేమిలేదని విమర్శించారు. కరోనా సంక్షోభం మోడీ చేతకానితనాన్ని బయటపెట్టిందని, 5 కేజీల బియ్యం, కేజీ శనగలు మినహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనుండి పేదలకు ఏ సహాయం అందలేదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 40లక్షల మంది భారతీయులు మోడీ ప్రభుత్వ విధానాల వలన ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. నోట్లరద్దు వల్ల నల్లధనం, దొంగనోట్ల బెడద ఉండదని మోడీ చెప్పినదానికి భిన్నంగా నేడు నకిలినోట్ల చలామణి నూరుశాతం పెరిగిందని, నల్లధనం మరింతగా పెరిగిందని ఆర్బీఐ నివేదికలు చెబుతున్నాయని, వీటినుండి ప్రజల దృష్టిని మరల్చడానికి మైనారిటీలకు వ్యతిరేకంగా మతోన్మాదాన్ని దేశప్రజలలో రెచ్చగొడుతున్నారని, దేశంలో జరిగే ప్రతీ అల్లర్లవెనుక బీజేపీ ఆరెస్సెస్ శక్తుల ప్రమేయం ఉందని, దేశంలో అశాంతినెలకొందని వివరించారు. ప్రజల సంపదతో నిర్మించిన ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్ కంపెనీలపరం చేయడాన్ని, పోరాడి సాధించుకున్న 44 కార్మికచట్టలను కాపాడుకొనేందుకై భవిష్యత్తులో సంఘం ఇచ్చే పిలుపులలో దేశప్రజలు, కార్మికులు, కర్షకులు పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఐక్యత – పోరాటం స్ఫూర్తితో మరిన్ని ఉద్యమాలు నిర్వహించాలని సిఐటియు పిలుపు ఇస్తోందన్నారు.
అనంతరం స్వీట్స్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి మలకా వెంకట రమణ, జిల్లా కార్యదర్శి నూకల బలరాం, జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకట రమణ,నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు లతో పాటు నాయకులు తుపాకుల వీర్రాజు, సిహెచ్. విజయ్ కుమార్, నాగాబత్తుల సూర్యనారాయణ, సిహెచ్. సతీష్, వరదా సురేష్, శ్రామిక మహిళలు వేణి, నాగలక్ష్మి, కుమారి, రాణి తదితరులు పాల్గొన్నారు.