Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

* పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తున్న యుటిఎఫ్ *

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ 🙁 విశ్వం వాయిస్ న్యూస్ )

మునిసిపల్ పాఠశాలలను విద్యాశాఖలో విలీనం చేసే ప్రక్రియను యూటీఎఫ్ వ్యతిరేకించింది. మున్సిపల్ పాఠశాలల పరివేక్షణ కోసము ,అకడమిక్ విద్యా విషయాలలో మాత్రమే విద్యాశాఖ పరివేక్షణను పరిమితం చేయాలని,ప్రస్తుతం మునిసిపల్ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉన్నాయని ,ఉపాధ్యాయులనుపాఠశాలలను,వాటి ఆస్తులను విలీనం చేయకుండా తీర్మానం చేయాలని కోరుతూ కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ సుంకర శివ ప్రసన్న ను కలిసి చర్చించడం జరిగింది. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖర రెడ్డితో ఫోన్ లో మాట్లాడ్డం జరిగింది.

ఈ సందర్భంగా మేయర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ మునిసిపల్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా విద్యా శాఖ నిర్ణయాలు సక్రమంగా అమలయ్యేలా పరిపాలనా సౌలభ్యం కొరకు మాత్రమే విద్యా శాఖ పర్యవేక్షణకు అనుమతించనున్నట్లు ఆ మేరకు మాత్రమే కౌన్సిల్ తీర్మానం చేయనున్నట్లు యుటిఎఫ్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

నేటి ప్రాతినిధ్యంలో యుటిఎఫ్ రాష్ట్ర ప్రతినిధి సిహెచ్.వి.రమణ,జిల్లా సంక్షేమ పధకం డైరెక్టర్ వజ్రపు మహేష్, జిల్లా కౌన్సిలర్ చల్లగళ్ళ సుబ్బారావు, ఆనంద భారతి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎస్.వి.ఎల్.రాజు కాకినాడ నగర యుటిఎఫ్ అధ్యక్షుడు కె.సువర్ణ రాజు, ప్రధాన కార్యదర్శి బి.రవి శ్రీనివాస్,కార్యదర్శి కె.దుర్గా శ్రీనివాస్ పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement