– అన్నవరం బ్రిడ్జి తెల్ల వారి గూడెం రహదారి పట్టింపు లేదా..?
– అధిక ధరలు పెంచడంపై ప్రతిపక్షాల ఆగ్రహం
– సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాసిల్దార్ గారికి వినతి పత్రం
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, వి.ఆర్.పురం:
వి అర్.పురం,( విశ్వం వాయిస్ న్యూస్)30;-
హద్దు అదుపు లేని ధరలను వెంటనే తగ్గించాలి సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్న అధికధరలు తగ్గించాలని దేశవ్యాప్తంగా వామపక్షాల పిలుపు మేరకు సోమవారం అల్లూరి సీతారామాజు జిల్లా వరరామచంద్రపురం మండల కేంద్రంలోని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సీపీఎం కార్యాలయం నుండి స్థానిక రెవిన్యూ కార్యాలయంకు భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు,ప్రజలు ర్యాలీగా వెళ్లి తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పెంచినటువంటి నిత్యవసర ధరలను, గ్యాస్,పెట్రోల్,డీజిల్,కరెంట్ చార్జీలువెంటనే తగ్గించాలని అన్నారు.అదేవిధంగా అన్నవరం బ్రిడ్జి కి నిధులు కేటాయించి బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలి డిమాండ్ చేశారు.నియోజకవర్గ ఎమ్యెల్యే,ఎమ్మెల్సీ లు అధికార పార్టీ నాయకులు వందల సంఖ్యలో కొబ్బరికాయలు కొట్టి రోడ్డును త్రవ్వి వదిలేసి సుమారు రెండు సంవత్సరాలు అవుతున్న పెద్దమట్టపల్లి నుంచి నర్సింగ పేట, తెల్లవారిగూడెం నుంచి గుల్లేటివాడ వరకు రోడ్డు పనులు పూర్తి చేయక పోవడంసిగ్గుచేటు అని విమర్శించారు.తక్షణమే ఆ రోడ్డు పనుల నిర్మాణాలను చేపట్టాలని అలా చేపట్టని ఎడల ఐటిడిఎ ను స్థానిక ప్రజలతో ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యలు పునేం సత్యనారాయణ,సిపిఎం మండల నాయకులు సోయం చిన్న బాబు,పంకు సత్తిబాబు,పులి సంతోష్ కుమార్,పొడియం శ్రీరామమూర్తి , మండల ఎంపీపీ కారం లక్ష్మీ,కుంజా నాగిరెడ్డి,తోడం రాజు,తుర్రం బాబురావు,వడ్లది రమేష్,కారం సుందరయ్య,సున్నం పార్వతి,గుటలా శ్రీను , చిన్నమట్టపల్లి ఎంపిటిసి సభ్యులు పునేం ప్రదీప్ కుమార్,పెద్దమట్టపలి,రేఖపల్లి,ములకనపల్లి,రామవరం సర్పంచులు వెట్టి లక్ష్మీ,పునేం సరోజిని,కారం బుచ్చమ్మ,సవలం మరయ్య,కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు.