Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 17, 2024 7:49 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 17, 2024 7:49 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 17, 2024 7:49 PM
Follow Us

చేసిన సేవలే ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆత్రేయపురం:

ఆత్రేయపురం ( విశ్వం వాయిస్ న్యూస్ )

నన్సిన సేవలే మనకు గుర్తింపు ఇస్తాయని ఆ గుర్తింపే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని టిడిపి కొత్తపేట ఇన్చార్జి రాష్ట్ర అధ్యక్షులు బండారు సత్యానందరావు అన్నారు. ఇటీవల కరోనా కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు లోల్ల గ్రామ సర్పంచ్ కాయల వెంకట్రావు మరణించారు. అయితే గ్రామ ప్రజలు ఆయన చేసిన సేవలు మరచిపోకుండా వారి కుటుంబంలో కుమారుడు కాయల జగన్నాధుని పోటీలో నిలబెట్టి మళ్ళీ గ్రామ సర్పంచ్ గా ఎన్నుకున్నారు.కాయల వెంకట్రావు చేసిన గ్రామాభివృద్ధి సేవలు ప్రతి ఒక్కరు నడుచుకోవాలని విధానంతో, అభిమానాన్ని చాటి చెప్పే విధంగా ఆదివారం ఆయన కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఎదురుగా కుమారుడు సర్పంచ్ కాయలు జగన్నాథం ఏర్పాటుచేసిన విగ్రహాన్ని ఆవిష్కరించి గ్రామ ప్రజలు నాయకులు కలిసి 150 లీటర్ల పాలాభిషేకం తో అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు. అనంతరం భారీ అన్నసమారాధన లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి రాష్ట్ర అధ్యక్షులు బండారు సత్యానందరావు పాల్గొన్నారు. అలాగే ఆయనతో పాటు పలు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ ఆయన చేసిన సేవలే ప్రజల హృదయాలను గెలుచుకున్నారు అని. 1981 నుండి మొదలైన ఎన్నికల పోటీ జీవితం పి ఏ సి ఎస్ ప్రత్యక్ష 11 మంది సంఘ సభ్యులతో కాయల వెంకట్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని 1987 వరకు ఆయన సేవలు అందించి. తిరిగి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 19 87 లో పోటీ చేసి 1994 వరకు తిరుగులేని ధీరుడు గా కొనసాగారని ఆయన అన్నారు. తిరిగి మరల 1995 లో బీసీ రిజర్వేషన్ మహిళను నిలబెట్టి ఈయన సారధ్యంలో లో గ్రామ అభివృద్ధి 2001 దాకా చేశారని. మరల 2001 గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాయల వెంకట్రావు పోటీ చేసి 2006 దాకా కొనసాగించి తిరిగి పోటీలలో కేవలం 34 ఓట్లతో ఆయన ఓడిపోవడం జరిగిందన్నారు. తిరిగి మరల 2023 లో వెంకట్రావు సారథ్యంలో ఎస్సి జనరల్ కాగా ఆయన బలపరిచిన అభ్యర్థి 900 భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు అన్నారు. అప్పటినుంచి 2021లో కాయల వెంకట్రావు పోటీ చేయగా 543 మెజార్టీ ఓట్లతో ఘన విజయం సాధించారని, తిరుగులేని వీరుడు గా నిలిచిన అటువంటి వ్యక్తిని దురదృష్టవశాత్తు కరోనా మహమ్మారి వల్ల ఆయన్ని కోల్పోవడం జరిగిందని

బండారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటువంటి మహనీయుడు అడుగుజాడల్లో కుమారుడు కాయల జగన్నాధుని ప్రజల గ్రామ సర్పంచి అభ్యర్థిగా ఎన్నుకొని అభిమానాన్ని చాటుకున్నారు అని ఆయన కొనియాడారు. అలాగే ఇప్పటి వరకు ఐదు దఫాలుగా జరిగిన ఎంపీటీసీ పోటీలలో మూడు దఫాలుగా కాయల వెంకటరావు ఆధ్వర్యంలో ఎంపిటిసిలు గెలుపొందారు అని ఆయన పేర్కొన్నారు. ఇక చెప్పాలనుకుంటే ఆయన సేవలు అమోఘమని గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన నుండి ఇ పంచాయతీ లో ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించడం నెమ్మదిగా మాట్లాడటం, గ్రామంలో రోడ్లు ప్రజలకు పెన్షన్లు ఇతర అభివృద్ధి పనులు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే అయినట్టు నాతో మాట్లాడి పలు అభివృద్ధి పనులు చేయించుకునే వారు అని బండారు పేర్కొన్నారు. ఎవరు ఈ గ్రామ సర్పంచ్ అభ్యర్థి అయిన గ్రామ అభివృద్ధికి పాటు పడితేనే ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రతి ఒక్కరు సర్పంచ్ వెంకట్రావు స్ఫూర్తిగా తీసుకుని గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అనంతరం ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బోనం సాయిబాబా, ఆత్రేయపురం సొసైటీ అధ్యక్షుడు పి ఎస్ రాజు, మెర్ల పాలెం సర్పంచ్ మెర్ల రాము, లొల్ల సర్పంచ్ కాయల జగన్నాథం ,కొత్తపేట మాజీ జెడ్పిటిసి ధర్నాల రామకృష్ణ , వాడపల్లి దేవస్థానం మాజీ చైర్మన్ కరుటూరి నరసింహారావు, మాజీ సర్పంచులు సయ్యప‌రాజు, రామకృష్ణంరాజు, బాల గురవయ్య ,నాయుడు, తోట రజిని ,ఏపీ గంటి రాఘవ ,పాలంగి రవిచంద్ర , మల్లవరపు నాగరాజు, కరుటూరి రవి ,మెర్ల నాగేశ్వరరావు ,పలువురు ఎంపిటిసిలు పలువురు నాయకత్వ నాయకులు అభిమానులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement