Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,169,711
Total recovered
Updated on April 1, 2023 12:15 AM

ACTIVE

India
15,208
Total active cases
Updated on April 1, 2023 12:15 AM

DEATHS

India
530,867
Total deaths
Updated on April 1, 2023 12:15 AM

** ఏసీ లకు కు అంత డబ్బు ఎందుకు..?

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

* పున పరిశీలన చెయ్యండి
* అధికారులపై కౌన్సిల్లో అధికార పార్టీ నేత రాజబాబు ఫైర్
* మున్సిపల్ పాఠశాలను విద్యాశాఖలో విలీనం చేయడంపై టిడిపి సభ్యుల వాకౌట్
* కుక్కలు ఎక్కువైపోయాయి నన్ను కూడా కరిచాయంటు కౌన్సిల్లో వాపోయిన అధికార పార్టీ కౌన్సిలర్ పిల్లి శ్రీనివాస్

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

 

విశ్వం వాయిస్ న్యూస్ మండపేట:

మండపేట మున్సిపల్ కౌన్సిల్లో సోమవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అజెండాలోని 6వ అంశం ఏసీ ల కొనుగోలు వ్యవహారం చర్చకు వచ్చినప్పుడు దానిని అధికార పార్టీ కో ఆప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబు వ్యతిరేకించారు. తర తమ బేధాలు లేకుండా ఉన్నది ఉన్నట్లు నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తిగా విలక్షణ శైలితో నడుచుకునే రాజబాబు అధికార పార్టీకి చెందినప్పటికి అధికారుల తీరును తప్పుబట్టారు. బయట మార్కెట్లో 65 వెలకే ఏసీ లు దొరుకుతున్నప్పుడు 80 వేలకు పైగా వెచ్చించడం దేనికంటూ ప్రశ్నించారు. ఈ దశలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, రాజబాబు ల మధ్య స్వల్ప ఆసక్తికర చర్చ నడిచింది. దీనిపై కమీషనర్ రామ్ కుమార్ వివరణ ఇస్తూ ప్రభుత్వ నిబంధనలు మేరకు అంచనా వ్యయం రూపొందించడం జరిగిందని, చివరిగా ఖాయమయ్యే రేట్లలో తగ్గింపు ఉంటుందని చెప్పారు.

 

మండపేట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ, అత్యవసర సమావేశాలు మున్సిపల్ చైర్మన్ పతివాడ రాణి అధ్యక్షతన జరిగాయి. మహానాడు, తిరుపతి పర్యటనలు నేపధ్యంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమావేశానికి హాజరు కాలేదు. సమావేశంలో ముఖ్యంగా పట్టణంలోని అన్ని మున్సిపల్ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనం లోని విద్యా శాఖకు అప్పగిస్తూ తీర్మానించడంపై టీడీపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. వైజాగ్ లో ఇలాగే ఆస్తులను విలీనం చేసుకుని ఆ తరువాత వాటిని తకట్టు పేర్చుకున్నారని ఇప్పుడు వీటిని కూడా అలాగే చేస్తారా అంటూ టీడీపీ కౌన్సిలర్ చుండ్రు చిన సుబ్బారావు చౌదరి మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా మున్సిపల్ చైర్మన్ ల ఆధీనంలో పురపాలక పాఠశాలలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయని, వాటిని ఇప్పుడు విలీనం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. 6వ వార్డు కౌన్సిలర్ కాశిన కాశీ విశ్వనాధం మాట్లాడుతూ విలువైన మున్సిపల్ ఆస్తులను ఉచితంగా ప్రభుత్వానికి ఎలా ధారాదత్తం చేస్తారంటూ ప్రశ్నించారు. ఈ తీర్మానానికి కౌన్సిల్ ఆమోదం తెలిపితే తాము కౌన్సిల్ నుండి వాకౌట్ చేస్తామని తెలిపారు. దీనిపై ఎమ్మెల్సీ తోట మాట్లాడుతూ గతం లో మున్సిపల్ ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వడం ఎంతో భారంగా ఉండేదని, అయితే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉద్యోగుల జీతాలను ట్రెజరీ ద్వారా చెల్లించడంతో పురపాలక సంఘాలపై ఒత్తిడి తగ్గిందన్నారు. విద్యా వ్యవస్థలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అందరికి ఒక తాటి పైకి తీసుకురావడం తప్ప వేరే ఏ ఉద్దేశ్యం లేదన్నారు. పైగా నిర్వహణ భారం పూర్తిగా రాష్ట్రప్రభుత్వం చూసుకుంటుందని తెలిపారు. మొత్తానికి ఈ అంశాన్ని ఆమోదించడం తో కౌన్సిలర్ కాశీ సమావేశం నుండి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి తోటి సభ్యులతో బయటకు వెళ్లిపోయారు. 8వ వార్డు కౌన్సిలర్ మందపల్లి రవి కుమార్ మాట్లాడుతూ పాఠశాలలు, వీధులు, ఇతరత్రా వాటికి దాతల పేర్లు పెట్టినట్లు అయితే వాటి వివరాలు కౌన్సిల్ కు తీసుకురావాలని కొరినాఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. దాతల వంతు కంట్రిబ్యూషన్ లేనట్లయితే ఆయా వాటికి జాతీయ నాయకుల పేర్లు పెట్టాలని సూచించారు. అదే విధంగా తన వార్డులో ఆర్పీ లేక ఇబ్బందులు పడుతున్నామని దీనిపై ఆర్పీని ఏర్పాటు చేయాల్సిందిగా ఎమ్మెల్సీ తోటదృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంలో సభ్యులు మధ్య వివాదం నడుస్తుందని టీఎంసీ తోటను తెలిపారు. దీనిపై ఆయా డ్వాక్రా సంఘాల సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని తోట ఆదేశించారు. అదే విధంగా సచివాలయ నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని రవి కుమార్ కోరారు. అదే విధంగా పట్టణంలో కుక్కల సమస్య విపరీతంగా ఉందని, స్వయంగా తననే కరిచాయంటూ వైసీపీ కౌన్సిలర్ పిల్లి శ్రీనివాస్ సమావేశంలో గాయాలు చూపించారు. తమ వార్డులో ఊక బుడిద సమస్య ఇంకా అలాగే కొనసాగుతుందని 24వ వార్డు కౌన్సిలర్ జొన్నపల్లి విజయలక్ష్మి ఆరోపించారు. దీనిపై పొల్యూషన్ అధికారులకు రెండు సార్లు పిర్యాదు చేయడం జరిగిందని కమీషనర్ రామ్ తెలిపారు. ఈ సారి అధికారులతో స్వయంగా తాను మాట్లాడతానని తోట పేర్కొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!