విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్:
మండలంలో రి సర్వే ను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యాన్ చంద్ అధికారులను ఆదేశించారు. మండలంలో శుక్రవారం పసలపూడి, మాచవరం గ్రామంలో జాయింట్ కలెక్టర్ ధ్యాన్ చంద్ పర్యటించి విలేజ్ సర్వే, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో జే సి మాట్లాడుతూ మండలంలో రీ సర్వే లు వేగవంతం చేయాలని, సర్వే రికార్డులను కంప్యూటరీకరణ త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. గ్రౌండ్ ట్రూత్, గ్రౌండ్ వాల్యూ షన్ తదితర అంశాలపై జెసి ధ్యాన్చంద్ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఏ డి, ఎ. బి ఎస్ ఎస్ వి గోపాలకృష్ణ, డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వే ఎ త్యాగరాజు, తాసిల్దర్ కే జే ప్రకాష్ బాబు, మండల సర్వేయర్ సుజాత,
గ్రామ రెవిన్యూ అధికారులు తదితరులు ఉన్నారు.