విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్:
సివిల్స్‌లో 350 ర్యాంకు సాధించడం ద్వారా దిబ్బాడ సత్యవెంకటఅశోక్ కాకినాడకు మంచిపేరు తెచ్చారని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. సివిల్స్ ర్యాంక్ సాధించిన అశోక్ తన తండ్రి వైఎస్సార్‌సీపీ నాయకుడు దిబ్బాడ పెదబాబుతో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని ఆయన నివాసంలో కలిసారు. ఈ సందర్భంగా అశోక్‌ను ఎమ్మెల్యే ద్వారంపూడి దుశ్శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో కష్టపడి చదివి దేశవ్యాప్త పోటీ పరీక్షలో అశోక్ మంచిర్యాంకును సాధించారని చంద్రశేఖరరెడ్డి ప్రశంసించారు. అశోక్ మరింతగా రాణించి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు సుంకర విద్యాసాగర్, మల్లిపాముల గణపతి, కార్పొరేటర్ కె.బాలాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.