విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్:
ముంపు నివారణ – గ్రామాల విలీనం -కాయి నిధుల బదలాయింపు – చెత్త పన్ను తొలగింపు – స్థానిక 36 అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశంలో సుదీర్గ చర్చ జరిగింది. స్థానిక సి పి ఎం నగర కమిటీ నాయకులు చింతపల్లి అజయ్ కుమార్ అధ్యక్షతన సుందరయ్య భవన్ మీటింగ్ హాలులో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2.30వరకు చర్చా వేదిక కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
నగర పాలకవర్గం 2017-22 అజెండా అంశాల్లో చేసిన మెజారిటీ తీర్మానాలు, ర్యాటిఫికేషన్లు నగర అభివృద్ధికి ఉపయోగపడకపోగా అవి తిరోగమనంగా వున్నాయని రౌండ్ టేబుల్ చేపట్టిన అధ్యయన వేదిక సమావేశం తీర్మానించింది.
భవిష్యత్ ప్రగతి కోసం ప్రశ్నించే పౌరులను రాబోయే ఎన్నికల్లో ప్రాతినిధ్యం చేసుకోవడం ద్వారా గ్రేటర్ కాకినాడ స్థాయి సాధించాలని కలిసి వచ్చే వారితో నగర అభివృద్ధి కమిటీగా ఏర్పడాలని నిర్ణయించారు. జిల్లా కలెక్టర్ ను 6వ తేదీన కలిసి కౌన్సిల్ చేపట్టిన విరుద్ద తీర్మానాల నిలుపుదల ముంపు నివారణ మార్గాలు, గ్రామాల విలీనం విషయాలు ప్రభుత్వం వహించాల్సిన ప్రాధాన్యత బాధ్యతలు తెలపాలని పేర్కొన్నారు. కార్యాచరణలో భాగంగా కార్పోరేషన్ కార్యాలయం. వద్ద గ్రామాల విలీనం తీర్మానం కోరుతూ ధర్నా , ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో పరిశీలన చేపట్టాలని ప్రతిపాదించారు. స్మార్ట్ సిటీ ఆర్థిక పద్దు, రేచర్ల పేట రైల్వే డ్రైన్ పునరుద్దరణ, మేడలైను వంతెన ఆక్రమణల నివేదిక, ప్రభుత్వ శాఖలకు తరలించిన జనరల్ నిధుల చిట్టా బహిరంగ పర్చాలని సమావేశం డిమాండ్ చేసింది. జాతీయ, రాష్ట్రీయ సమస్యలతో బాటుగా ప్రతి నెల ప్రత్యేకించి స్థానిక సమస్యలపై అన్ని రాజకీయ పార్టీలు సమావేశాలు నిర్వహిస్తే కార్పోరేషన్ లో తప్పుడు పనులు అనుచిత తీర్మానాలు జరగవన్నారు. అధికార పార్టీకి కార్పోరేషన్ స్థలం ఇవ్వడం, గరల్స్ పాలిటెక్నిక్ భూములు ప్రయివేటు ఆసుపత్రి కి ఇవ్వడం, జనరల్ నిధులు ఇష్టారాజ్యం చేయడం, కార్పోరేషన్ భవనం లేకుండా పరిపాలన చేయడం, త్రాగు నీరు అవసరాలు, డంపింగ్ యార్డు తరలింపు , ముంపు నివారణ, పనులు లేకుండా నెలకు 30 లీటర్ల పెట్రోలు బత్యం కోసం కౌన్సిల్ తీర్మానాలు చేసిన రీతిగా ఇష్టారాజ్యం పనులతో అప్రతిష్ట తెచ్చిన 36 ప్రధాన అంశాల అజెండా పై సుదీర్ఘంగా చర్చ నిర్వహించారు. చెత్త పన్నులు రద్దు చేయాలని ప్రజలు సహాయ నిరాకరణ చేపట్టాలని పిలుపు నిచ్చారు. కోర్టు వ్యాజ్యం తేలే వరకు ఆస్తి పన్నులు పాత పద్దతిలో చెల్లించుకోవాలని డిమాండ్ చేశారు. సి పి యం జిల్లా కన్వీనర్ మోర్తా రాజ శేఖర్, ఎస్ సి. ఎస్ టి సెల్ మానిటరింగ్ కమిటీ మాజీ మెంబర్ అయితా బత్తుల రామేశ్వరరావు, పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు, తోకల ప్రసాద్ (సి పి ఐ) ఆకుల వెంకట రమణ ( కాంగ్రెస్) ఆట్ల సత్యనారాయణ మూర్తి (జనసేన) జల్లూరి వెంకటేశ్వర్లు ( న్యూ డెమోక్రసీ) పిట్టా వర ప్రసాద్ (రిపబ్లికన్ పార్టీ) హాసన్ షరీఫ్ ( వెల్ఫేర్ పార్టీ) రంభాల సతీష్ ( జనశక్తి) చొల్లంగి వేణు గోపాల్ (బహుజన ఫ్రంట్) పప్పు దుర్గా రమేష్ ( ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక) గుబ్బల ఆదినారా యణ ( న్యూ డెమోక్రసీ) శర్మ (లిబరేషన్) బచ్చలకామేశ్వర రావు (దళిత ఫ్రంట్) నరాల శివ ( ఆమ్ ఆద్మీ) తిరుమల శెట్టి నాగేశ్వరరావు ( రైతు సంఘం) జుత్తుక శ్రీనివాస రావు ( సిపిఎం నాయకులు ) గంగా సూరిబాబు, మణికంఠ (ఎస్ ఎఫ్ ఐ) అనపర్తి ఏడుకొండలు ( సిఐటియు నాయకులు) తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.