విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:
రావులపాలెం(విశ్వం వాయిస్)
వైకాపా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని కోనసీమ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు చిలువూరి సతీషారాజు అన్నారు. రావులపాలెంలోని తెదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రతీ ఏడాది పెరగాల్సిన ఉత్తీర్ణత శాతం జగన్ చేతకానితనంతో అథమ స్థాయికి చేరిందన్నారు. జగన్ ప్రభుత్వంలో మొదటి సారిగా జరిపిన పదో తరగతి పరీక్షలకు 6లక్షల మంది విద్యార్థులకు హాజరవుతే వాటిలో 2లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత కాలేదంటే ఎంత అవమానమో
తెలుసుకోవాలన్నారు. అన్ని వ్యవస్థలను ఏ విధంగా నాశనం చేశారో అదే విధంగా జగన్ విద్యా వ్యవస్థను కూడా నాశనం చేశారన్నారు. తెదేపా ప్రభుత్వంలో 95శాతంఉత్తీర్ణత అయితే వైకాపా ప్రభుత్వంలో 67 శాతం మంది ఉత్తీర్ణత అయ్యారన్నారు. ప్రశ్నా పత్రాలను వైకాపా నాయకులే లీక్ చేసి తాము తప్పించుకునేందుకు
నారాయణను ఇరికించారన్నారు. గతంలో చంద్రబాబు రెండు సార్లు డీఎస్సీ తీసి ఉద్యోగాలు కల్పిస్తే ఈరోజున 20వేల మంది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటేఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్నారు. పరిపాలన ఏ విధంగా ఉందో చూస్తే అర్థం అవుతుందన్నారు. నాడునేడులో ఉన్న శ్రద్ధ కనీసం విద్యార్థులకు చదువు చెప్పే ఉపాధ్యాయులను నియమించడంలో లేదన్నారు. నాడునేడులో వేల కోట్ల రూపాయిలు పనులు చేసి వీటిలో 3500 కోట్లు అవినీతి జరిగిందన్నారు. జాబ్ క్యాలెండ్ను
విడుదల చేస్తానని చెప్పి నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేశావో ప్రస్తుతం విద్యార్థులను కూడా అదే విధంగా మోసం చేశామన్నారు. త్వరలో జరగబోయే పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో గుత్తుల రాంబాబు, కరుటూరి రవి, పడాల బులికొండారెడ్డి, సయష్యరాజు నరసింహారాజు, సాయివర్మ, కోట వెంకటేశ్వరరావు, చింతా శ్రీరామరెడ్డి, సాధనాల బాబి బొంతు రాంబాబు, వంశీ జక్కంపూడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు…