విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:
విశ్వం వాయిస్ న్యూస్ మండపేట:
యోగా సంపూర్ణ ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతను అందించడం లో ఎంతగానో దోహద పడుతుందని ప్రముఖ జిమ్ కోచ్ పోలయ్య అన్నారు. అంతర్ఙాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మండపేట వాసవిక్లబ్, వనిత ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా శిక్షణా తరగతులు మంగళవారం నిర్వహించారు. త్రిభువన్ జిమ్ ఫిటినెస్ సెంటర్ లో నిర్వహించిన ఈ శిక్షణలో కోచ్ మేదర పోలయ్య మాట్లాడుతూ కరోనా సమయంలో ఎదురైన తీవ్రమైన మానసిక ఒత్తిడి నుండి బయటపడేందుకు యోగ ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ప్రతీ రోజు కనీసం అరగంటైనా యోగ సాధన చేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలన్నారు. ఈ సందర్భంగా వాసవిక్లబ్స్ ఇంటర్నేషనల్ రీజియన్ చైర్మన్ బోడా వీర్రాజు ప్రత్యేక అతిధిగా పాల్గొని కోచ్ పోలయ్యను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు బోనగిరి ఉమ, నార్కెడిమిల్లి సుబ్బారావు, వన్నెంశెట్టి లక్ష్మి బంగారం, సంకా సీత, మండవిల్లి దేవి, కాళ్ళకూరి శాంతి తదితరులు పాల్గొన్నారు.