విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, చింతూరు:
చింతూరు – విశ్వం వాయిస్ న్యూస్
చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ రత్న మాణిక్యం తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండేందుకు యోగ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రశాంత జీవితాన్ని కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ యోగ జ్ఞానాన్ని అలవర్చుకోవాలని కోరారు. వైస్ ప్రిన్సిపాల్ జి వెంకట్రావు మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మానవత్వం కోసం యోగ అనే కిమ్ పై అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించబడుతుంది అని అన్ని వయసుల వారికి పనికివచ్చే యోగ విద్యా తక్కువ కాలంలో ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జి వెంకట్రావు, అర్చకులు ఎం శేఖర్ డాక్టర్ పద్మ హారతి,సి గౌతమ్ అధ్యాపకేతర సిబ్బంది. బండి రమేష్ సీనయ్య సంఘం నాయుడు సుబ్బారావు. చంద్రయ్య విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.