విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:
ఆలమూరు ( విశ్వం వాయిస్ న్యూస్):
మండల పరిధిలో కలవచర్ల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కొత్తపేట ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రతి గడపలో ప్రభుత్వ పథకాలు అందే తీరును అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా జవాబుదారీతనంతో, ఎంతో బాధ్యతగా ఎమ్మెల్యే చిర్ల పర్యటన కొనసాగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతివీధిలో ప్రతి ఇంటికి ఆయన స్థానిక నాయకులు అధికారులతో కలిసి వెళ్ళారు. ఒక్కోగడపలో 10 నిముషాలకు పైగా సమయాన్ని వెచ్చిస్తూ ఎంతో ఓర్పుతో ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, సమస్యలకు పరిష్కారం చూపారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల వల్ల వారికి చేకూరిన లబ్దిని వివరిస్తూ, ఇంకా ఏమైనా పథకాలు రావాల్సినవి ఉన్నాయా అని ప్రశ్నించారు. నవరత్నాల అమలు గురించి వాకబు చేశారు. కొందరు పక్కాగృహాలు మంజూరు చేయాలని అడుగగా హౌసింగ్ అధికారులతో మాట్లాడి వెంటనే వారికి అర్హతలను బట్టి పక్కాగృహాలు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అర్హత ఉండి కూడా ఏమైనా పథకాలు వర్తించలేదా…? అని ప్రశ్నించారు. ఏమైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే సరి చేసి పథకాలు వర్తింప చేయాలని సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు ఆదేశాలు ఇచ్చారు. అప్పటికప్పుడు సమస్యలకు పరిష్కారం చూపారు. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తమ ఇళ్ళకు వచ్చి పలుకరించి పథకాల అమలు గురించి ఆరా తీయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు మండల వైయస్సార్సీపి కన్వీనర్ తమ్మన శ్రీనివాస్, ఎంపిపి తోరాటి లక్ష్మణరావు, నెక్కింటి వెంకట్రాయుడు (బుజ్జి), యనమదల నాగేశ్వరరావు, గుమ్మిలేరు సర్పంచ్ గుణం రాంబాబు, దొండపాటి చంటి, గొడితి వెంకన్న, వనం శ్రీనివాసు, తోరాటి రాంబాబు, మండల ఉపాధ్యక్షురాలు వాసంశెట్టి దుర్గ భవాని, ఎంపీడీవో జేఏ ఝాన్సీ, తాసిల్దార్ లక్ష్మీపతి, ఏవో ఎస్ లక్ష్మి లావణ్య, పలువురు నాయకులు అధికార యంత్రాంగం పాల్గొన్నారు.