విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:
*భక్తుల కోర్కెలు తీరుస్తున్న అమలాపురం పెళ్లిళ్ల వెంకన్న*కోర్కెలు నెరవేరిన భక్తులు స్వామికి విరాళాలు*
*ఏడు శనివారాలు 27 నక్షత్ర ప్రదక్షిణలు చేసినవారికి కోర్కెల నెరవేరుస్తున్న వెంకన్నస్వామి*.
అమలాపురంవిశ్వం వాయిస్ న్యూస్
కోరిన కోర్కెలు తీర్చిన వెంకన్నకు విరాళం
:అమలాపురం కల్యాణ వెంకటేశ్వరస్వామి సన్నిధిలో ఏడు శనివారాలు.. ఇరవైఏడు నక్షత్రప్రదక్షణలు చేస్తే కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తులు విశ్వసిస్తున్నారు.ఇటీవలి కాలంలో ఏడువారాలు ప్రదక్షిణలు పూర్తయ్యాక అనేకమంది కోర్కెలు తీరిన వ్యక్తులు వారం వారం పదుల సంఖ్యలో ఆలయంలో చెప్పి మరే వెళ్తున్నారు ఇలా మొక్కు తీర్చుకున్న వారిలో అనేకమంది యువతీయువకుల పెళ్లిళ్లు కుదురుతున్నాయి, ప్రభుత్వ ఉద్యోగులకు అనుకున్న చోటికి ట్రాన్సఫర్లు అవుతున్నాయి.తాజాగా నడిపూడి గ్రామానికి చెందిన అరిగెల వెంకటసుబ్బారావు స్వామివారి మొక్కు తీర్చుకున్నారు తాను అనుకున్నది అయినందుకు స్వామివారికి విరాళంగా 10116 లను స్వామివారి ఆలయంలో ఛైర్పెర్సన్ దూడల విరీతదేవిఫణికి అందచేశారు.దాతలకు స్వామివారి చిత్రపటాన్ని అందచేసి దుశ్శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు నడింపల్లి వర్మ,దునబోయిన బుజ్జి, ఈఓ దునబోయిన సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.