విశ్వంవాయిస్ న్యూస్, అల్లవరం:
వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి. అల్లవరం విశ్వం వాయిస్ న్యూస్ మార్చి 27: అల్లవరం మండలం నక్క రామేశ్వరం గ్రామం చెందిన పాలెపుశ్రీను40 వేటకు వెళ్లి తిరిగి రాలేదు . కుటుంబ సభ్యులు పరిశీలన చేయగా అప్పటికే మృతి చెందాడని తెలిసింది. దాంతో అల్లవరం పోలీసులకు భార్య ఫిర్యాదు చేసింది. ఒక్క కుమారుడు కుమార్తె సంతానం కలిగి ఉన్నారు. ప్రభుత్వ పరంగా తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. డైరెక్టర కర్రీవెంకటరామరాజు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వపరంగా వచ్చే ఆర్థిక సహాయాన్ని మంత్రి విశ్వరూప్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.