తాళ్లరేవులోని బుద్ధ విహారలో జరిగిన సమావేశం
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
తాళ్ళరేవు మండలంలోని జాతీయ రహదారి 216 లో అనుకుని ఉన్న బుద్ధ విహార్ లో బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు యువకులు కృషి చేయాలని, అలాగే బౌద్ధ ధర్మాన్ని గురించి యువకులకు ఉపదేశం చేశారు. అనంతరం 12 మంది యువకులు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు. వారికి రాష్ట్ర అధ్యక్షుడు సర్టిఫికెట్లు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో బౌద్ధ ధర్మం స్వీకరించిన వారిలో వాడపల్లి, గోపి మరియు బుద్ధిష్టి సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కుటుంబరావు తదితర బౌద్ధ ధర్మ మండల నాయకులు పాల్గొన్నారు.