WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

రామచంద్రపురంలో అంగరంగ వైభోగంగా అభిరుచిలతో అన్న కేంటిన్ ఆరంభం 

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

రామచంద్రపురంలో అంగరంగ వైభోగంగా అభిరుచిలతో అన్న కేంటిన్ ఆరంభం

 

నిరుపేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం

 

అన్న క్యాంటీన్లో పూటకి ఐదు రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం సాయంత్రం నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనం

 

అన్న క్యాంటీన్లలో ఎవరైనా వచ్చి తినొచ్చు

 

ఎంతమందికైనా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం

 

ముఖ్యధితులుగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్,అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్,కొనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్

 

విశ్వం వాయిస్ న్యూస్ రామచంద్రపురం నియోజకవర్గం నిరుపేదల ఆకలి తీర్చేందుకే రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు.శుక్రవారం రామచంద్రపురం లోని పాత బస్టాండు సెంటర్ వద్ద అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తో కలిసి మంత్రి అన్న క్యాంటీన్ ప్రారంభించారు. ప్రారంభించిన అనంతరం మంత్రి ఎంపీ కలెక్టర్ స్వయంగా అక్కడికి వచ్చిన వారికి అల్పాహారం వడ్డించారు.

ఈసందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 100 అన్న క్యాంటీన్లు పునః ప్రారంభమయ్యాయని, దానిలో భాగంగా రామచంద్రపురం పాత బస్టాండ్ సెంటర్ వద్ద అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు.ఈ అన్న క్యాంటీన్లలో సుమారు 350 మందికి ప్రతిరోజు పూటకి కేవలం ఐదు రూపాయలకే అల్పాహారం,మధ్యాహ్నం సాయంత్రం నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనం అందించడం జరుగుతుందన్నారు. ఒకవేళ తాకిడి ఎక్కువయ్యి ఎక్కువ మంది వచ్చినా అందరికీ భోజనం అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలకు, వలస కార్మికులకు,భవన నిర్మాణ కార్మికులకు ప్రతిరోజు అల్పాహారం భోజనం అందుబాటులో ఉంచుతామన్నారు. పేదలకు అన్నం పెట్టే దిశగా ఎన్డీఏ కూటమి ఎన్నికల హామీలు నెరవేరుస్తూ అన్న క్యాంటీన్ పునః ప్రారంభించిందని,వారానికి రెండు మూడు రోజులు మంత్రి కూడా అన్నా క్యాంటీన్లో నాణ్యతను ధ్రువీకరించడానికి అల్పాహారం భోజనం చేస్తానని తెలిపారు. ప్రస్తుతం 100 అన్న క్యాంటీన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించామని త్వరలో మరో 75 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు.అన్న క్యాంటీన్ల లో ఉదయం అల్పాహారం రెండుపూట్ల భోజనం సరఫరా, క్యాంటీన్ల నిర్వహణ, విద్యుత్ టెలిఫోన్ బిల్లులు సిబ్బంది జీతాలకు తదితరాలకి సుమారుగా రోజుకు ఒక వ్యక్తికి 90 రూపాయలు ఖర్చవుతుందని,కానీ ప్రభుత్వం 15 రూపాయలకే ప్రతిరోజు ఆహార అందిస్తుందని,మిగతా 75 రూపాయలు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ మాట్లాడుతూ భోజనం లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు 2014 -19 లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రారంభించిందని,కానీ గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ కొనసాగించలేదని. నిరుపేదలు వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ఎన్డీఏ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో అన్నా క్యాంటీన్ ని పునః ప్రారంభిస్తామని ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా వంద అన్నా క్యాంటీన్లను ఇప్పటివరకు ప్రారంభించామన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నా క్యాంటీన్లో ఎవరైనా భోజనం చేయొచ్చన్నారు.

ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్,రామచంద్రపురం ఆర్డీవో సుధాసాగర్, రామచంద్రపురం మున్సిపల్ చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్,అన్న క్యాంటీన్ల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement