విశ్వంవాయిస్ న్యూస్, అలమలాపురం:
భారత్ బంద్ కి పిలుపు..
అమలాపురం టౌన్ విశ్వం వాయిస్ న్యూస్
డాక్టర్ బి అర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఈదరపల్లి దగ్గర డాబాగార్డెన్ లో మాలమహానాడు జేఏసీ సభ్యులు సమావేశం జరిగింది. ఆగష్టు 1 న సుప్రీంకోర్టు వర్గీకరణ చేస్తూ ఇచ్చిన తీర్పును వ్యతిరేకస్తూ ఈ నెల 21న బుధవారం నాడు భారత్ బంద్ కి దేశంలోని వివిధ ప్రజాసంఘాలు దళితసంఘాలు మాలమహానాడు సంయుక్తంగా పిలుపునిచ్చారు. కావున 21 న చేపట్టే బంద్ కి అన్ని వర్గాలవారు ఛాంబర్ అఫ్ కామర్స్ వారు విద్యాసంస్థలు అన్నిరకాల దుకాణదారులు అన్ని రకాల వాహనయూనియన్స్ వారు మరియు అన్ని ప్రభుత్వరంగ సంస్థలు సహకరించి వర్గీకరణ జరగకుండా మేము చేపట్టే మా ఉద్యమానికి సహకరిస్తారని కోరుకుంటున్నాము. ఈ సమావేశంలో పండు అశోక్ కుమార్, ఏం ఏ కే భీమరావు, జగడం సత్యనారాయణ జల్లి శ్రీనివాసరావు ఉండ్రు బాబ్జి చీకురుమిల్లి కిరణ్ కుమార్ పెయ్యిల పరశురాముడు పోతుల నాగరాజు నాతి శ్రీనివాస్ నక్కా సంపత్ కుమార్ కుంచే బాబులు బొంతు రమణ గెల్లా రాజేంద్ర ఉబ్బన శ్రీను మోకా శ్రీను ఉటాల వెంకటేష్ సాధనల శ్రీను మెండి డేవిడ్ పోతూముడి రవికుమార్ పొలామూరి మాణిక్యాలరావు బొంతు రాజేంద్ర జర్జ్ జక్కల ప్రసాద్ మేఘరాజు ముత్తాబత్తుల రాంబాబు ములపర్తి కాశీ మెండు రమేష్ తదితరులు పాల్గొన్నారు