విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
రామచంద్రపురంలో వైద్య సేవల నిలిపివేత
కోల్ కత్తా లో జరిగిన వైద్యురాలి అత్యాచారం, హత్య కేసులో న్యాయం కోసం డిమాండ్
ఐఎంఏ అదేశాలు మేరకు రామచంద్రపురం పట్టణ డాక్టర్లు భారీ ర్వాలి
వైద్య సిబ్బంది కేంద్ర రక్షణ చట్టం చేయాలి
ఆంధ్రప్రదేశ్ వైద్య సిబ్బంది రక్షణ చట్టాన్ని సవరించి కఠిన తరం చేయాలి
రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్:- కోల్ కతాలో ఆర్.జీ.కర్ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో ఆగస్టు 9వ తేదీ రాత్రి డ్యూటీలో ఉన్న మహిళా వైద్యురాలిపై అమానుషంగా సామూహిక అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేసిన కేసులో సత్వర న్యాయం కోసం డిమాండ్ చేస్తూ,దానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న రామచంద్రపురం డాక్టర్లు.
ఆర్.జి.కర్ వైద్య కళాశాల ఆసుపత్రి విద్యార్థులు,వైద్యులపై ఆగస్టు 14వ తేదీ రాత్రి రౌడీముకల దాడులను నిరసిస్తూ జాతీయ ఐఎంఏ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ శాఖలు 17వ తేదీన 24 గంటలపాటు వైద్య సేవలు నిలిపివేయాలని పిలుపునివ్వడం జరిగిందని,అందులో భాగంగా రామచంద్రపురంలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు పట్టణంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులలో, అత్యవసర సేవలు మినహాయించి,ఓపిడి సేవలు,అత్యవసరం కాని శస్త్ర చికిత్సలు పూర్తిస్థాయిలో నిలిపివేయడం జరుగుతుందని ఐఎంఏ రామచంద్రపురం డాక్టర్లు అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇలాంటి ఘటనలు దేశంలో మళ్ళీ జరగకుండా ఉండేలా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి,సిబిఐ ఆధ్వర్యంలో త్వరితగతిన నేర పరిశోధన పూర్తి చేసి,నేరానికి పాల్పడిన వారిపై కఠిన శిక్షలు పడేలా చూడాలని,ఆసుపత్రులలో డ్యూటీలో ఉన్న వైద్యులకు,వైద్య సిబ్బందికి తగిన రక్షణ కల్పించే వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.అలాగే ప్రత్యేక రక్షణ చట్టాలు కేంద్ర స్థాయిలో తీసుకురావాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైద్య సిబ్బంది రక్షణ చట్టాన్ని సవరించి కఠిన తరం చేయాలని ప్రభుత్వంన్ని డిమాండ్ చేస్తున్నామని ఐఎంఏ రామచంద్రపురం డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పి.వెంకటరత్నం,కార్యదర్శి డాక్టర్ జి.జానకి రామ చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమంలో నర్సింగ్ సిబ్బంది మరియు హాస్పిటల్ లో వివిధ శాఖలలో పనిచేసిన వారు పాల్గొన్నారు.