సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన పిల్లి దంపతులు
కాకినాడ రూరల్ నియోజకవర్గం
ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందని నియోజక వర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే "పిల్లి" దంపతులు అన్నారు. వలసపాకల లోని తమ నివాసం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆశ్రయించి దరఖాస్తు చేసిన 20 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 18 లక్షల విలువైన చెక్కులను కో ఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని ప్రతి...
గంగనాపల్లిలో వారాహి అమ్మవారి పూజలు
కాకినాడ రూరల్
వారాహి అమ్మవారి ఆలయంలో సామూహిక సరస్వతీ పూజలు నిర్వహించారు. కాకినాడ రూరల్ గంగనాపల్లి గ్రామంలోని వారాహి నగర్ లో వేంచేసియున్న అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో సుమారు మూడు వందల మంది బాలబాలికలచే సరస్వతీ పూజలు నిర్వహించారు.అనంతరం కాకినాడ బృందం వారిచే కోలాటం ప్రదర్శన నిర్వహించారు.ఈసందర్భంగా దుప్పలపూడి జ్యోతి, సత్యనారాయణ మాట్లాడుతూ వారాహి అమ్మవారు కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులకు దర్శనమిస్తున్నారని,ఆలయ అర్చకులు సాయి కిరణ్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ అభిషేకం,కుంకుమార్చనలు,హొయలు, సరస్వతీ పూజలు జరుగుతాయని తెలిపారు.నవరాత్రులలో భాగంగా 9వ రోజు శుక్రవారం శివపార్వతుల కళ్యాణం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు.