విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం
రామచంద్రపురం స్థానిక 4వ వార్డ్ గీత థియేటర్ వద్ద 15వ ఆర్థిక సంఘం నిధులు నుండి కేటాయించబడిన రు. 775000 సిసిరోడ్డు నూతన నిర్మాణానికి కార్మిక శాఖ మంత్రి వాసoశెట్టి సుభాష్ శంకుస్థాపన చేసారు.ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, వాసంశెట్టి సత్యం,మున్సిపల్ కమిషనర్,డిఈ,ఏఈ లతో పాటు ఇతర మున్సిపల్ సిబ్బంది స్థానిక నాయకులు,4వ వార్డ్ కౌన్సిలర్ పాలపర్తిమధు,కృష్ణ,వైస్ చైర్మన్ శివాజీ,వార్డు సభ్యులు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
యోగ వాకార్స్ సభ్యులు
విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం
రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని అఖిల పక్షజేఏసీ ఆధ్వర్యంలో కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో యోగా వాకర్ సభ్యులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు,కో కన్వీనర్ బి సిద్దు,గొల్లపల్లి కృష్ణ మరియు మున్సిపల్ కౌన్సిలర్స్,యోగా వాకర్ సభ్యులు ఇతర జేఏసీ నాయకులు పాల్గొనడం జరిగింది.
రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేసే వరకు మా పోరాటం ఆగదు
విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం
రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేసే వరకు మా పోరాటం ఆగదు
ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా
అఖిల పక్ష జాయింట్ యాక్షన్ కమిటీ
రామచంద్రపురం నియోజకవర్గం విశ్వం వాయిస్ న్యూస్ :-రామచంద్రపురం నియోజకవర్గ అఖిల పక్ష జాయింట్ యాక్షన్ కమిటీ (జె.ఏ.సీ) ఆధ్వర్యంలో సోమవారం ఉదయం పది గంటలకు రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్ నుండి ప్రారంభమైన ప్రదర్శన, ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నాగా మారింది.ప్రజల న్యాయమైన డిమాండ్ అయిన కాకినాడ జిల్లాలో విలీనం కోసం నాయకులు గళమెత్తారు. రామచంద్రపురం నియోజకవర్గ అఖిల పక్ష జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, కో-కన్వీనర్ బి.సిద్ధూ,...
రామాలయం పునః నిర్మించుటకు శంకుస్థాపన
విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం
రామాలయం పునః నిర్మించుటకు శంకుస్థాపన
20 లక్షలు ఎంపీ నిధులు
రామచంద్రపురం రూరల్ విశ్వం వాయిస్ న్యూస్ :-రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం వంతెన వద్ద గల శెట్టిబలిజ కోదండ రామాలయం పునర్ నిర్మించుటకు శంకుస్థాపన కార్యక్రమం జరిగినది.ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎంపీ నిధుల నుండి 20 లక్షల రూపాయలు ఇటీవల మంజూరు చేసిన విషయం తెలిసిందే.అయితే శంకుస్థాపన కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మరియు తోట పృథ్వీరాజు పాల్గొన్నారు.విరుతో పాటు కే గంగవరం ఎంపీపీ పంపన నాగమణి, సుబ్బారావు,మాజీ ఏపీఐ డిసి డైరెక్టర్ వాసంశెట్టి శ్యామ్,స్థానిక సర్పంచ్ ఎల్లమిల్లి సతీష్ కుమారి, ఎంపీటీసీ సభ్యులు కనితి వెంకటేశ్వరి అలానే...
మంత్రి సుభాష్ చేతుల మీదుగా కనకదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట
విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం
మంత్రి సుభాష్ చేతుల మీదుగా కనకదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట
రామచంద్రపురం నియోజకవర్గం విశ్వం వాయిస్ న్యూస్ :-
రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం సత్యవాడ గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ మహా గణపతి,సుబ్రహ్మణ్యేశ్వర, వరాల కనకదుర్గ అమ్మవారి సువర్ణయంత్ర విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా సోమవారం జరిగింది. ఆలయ అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ తన చేతుల మీదుగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరగడం తన...
ఇంటింటికి వంచన ప్రచారంలో పాల్గొన్న మాజీమంత్రి గొల్లపల్లి
విశ్వం వాయిస్ న్యూస్, రాజోలు
గుబ్బలపాలెం లో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం
ఇంటింటికి వంచన ప్రచారంలో పాల్గొన్న మాజీమంత్రి గొల్లపల్లి
రాజోలు నియోజకవర్గం విశ్వం వాయిస్ న్యూస్ :-మలికిపురం మండలం గుబ్బలపాలెం గ్రామంలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు యల్లమెల్లి రామారావు అధ్యక్షతన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా మాజీ మంత్రివ రాజోలు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి గొల్లపల్లి సూర్య రావు,జడ్పీటీసీ సభ్యురాలు బల్ల ప్రసన్న కుమారి హాజరయ్యారు.
తొలుత గొల్లపల్లి వైసీపీ నాయకులతో కలిసి స్థానికంగా ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం వైసీపీ పార్టీ పతాకం ఆవిష్కరణ చేశారు.
బాబు...
రోడ్ ప్రమాదం. ముగ్గురుకి గాయాలు
విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం
రామచంద్రపురం-కాకినాడ ప్రధాన రహదారిలో కభేలా సమీపంలో బైక్ అదుపుతప్పి ముగ్గురు యువకులు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్పంగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ప్రయాణికులు 108కి సమాచారం అందించగా, క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. యువకులు ఉలపల్లి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.
రోటరీ క్లబ్ సామాజిక సేవలు ప్రశంసనీయం
విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం
రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ :-సమాజానికి సేవలు అందిస్తున్న రోటరీ క్లబ్ సేవలు అభినందనీయమని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్,రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ తండ్రి సత్యం పేర్కొన్నారు.ఆదివారం అన్నయిపేట గ్రామంలో కాకినాడ రోటరీ క్లబ్ సౌజన్యంతో అన్నయపేట పంచాయతీ నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ (జల కళ్యాణం) ప్రారంభోత్సవం జరిగినది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా గ్రామ సర్పంచ్ పెమ్మిరెడ్డి దొరబాబు,ముఖ్య అతిథులుగా సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం, రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, రోటరీ అధ్యక్షులు తడాలబుజ్జి రోటరీ సెక్రెటరీ సతీష్ లు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో సత్యం మాట్లాడుతూ...
సంఖ్య శాస్త్రం అనేది గణిత శాస్త్రానికి మణిహారం
విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం
సంఖ్య శాస్త్రం అనేది గణిత శాస్త్రానికి మణిహారం
రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ :-అంకెలు ఆత్మానందాన్ని, ఉత్సాహమును ఇస్తాయని సౌందర్యా అన్వేషణ,హేతువాదానికి గణితమే అందమని గణిత సేవా సంస్థ రామానుజన్ గణిత అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కే వి వి సత్యనారాయణ అన్నారు. రామానుజన్ గణిత అకాడమీలో సంఖ్యా శాస్త్రంపై జరిగిన సెమినార్ కు అధ్యక్షత వహించారు మరియు ఆయన ప్రసంగిస్తూ గణిత శాస్త్రం మేదో సంబంధమైన కళ అని. అంకెల మధ్య ఉన్న లయ, క్షేత్రగణిత ఆకారాల మధ్య గల శృతి సోయగాలు గణిత వేత్తలకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయని అందుచేతనే న నిరంతరము గణిత పరిశోధకలు జరుగుతున్నాయన్నారు....
ఉద్యమాలు అడ్డుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెడతాం
విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం
రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ :-రామచంద్రపురం నియోజకవర్గం బిసివై పార్టీ ఇంచార్జ్ బర్ల.శ్రీనివాస్ యాదవ్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టనీయకుండా భారతచైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ ను పోలీసులు అడ్డుకున్న తీరు ప్రజాస్వామ్యానికి మచ్చ అని వ్యాఖ్యానించారు.అలానే భారతరాజ్యంగం ప్రసాదించిన సంచార స్వాతంత్ర్యానికి విరుద్ధంగా వ్యవహరించి,పోలీసులు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.గత ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలపై ఇదే తీరున ప్రవర్తించి హోదాలేని ప్రతిపక్షంగా మారిపోయిందని ఆయన గుర్తుచేశారు.అధికారం అడ్డుపెట్టుకొని ఉద్యమాలను అడ్డుకోలేరని, ప్రజాసమస్యలు ఉన్నంతకాలం పోరాటం చేస్తూనే ఉంటామని మా గొంతులు నొక్కలనీ చూస్తే ప్రజా వ్యతిరేకత మూటకట్టుకోవలసి...