Thursday, August 7, 2025
Thursday, August 7, 2025
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
8 ARTICLES

K SUNILJOHNKUMAR

My name is Khandavelli Sunil John Kumar. I have been running the Vishwam Voice Telugu daily newspaper in the united Andhra Pradesh and Telangana for the past 9 years. I started this newspaper with the mission of exposing corruption and irregularities in society and raising awareness among the public. To strengthen this cause, we established Vishwam Voice Media Network Private Limited with the vision of being a voice for the poor and marginalized. Our company has expanded into digital platforms, including a mobile app, a website, and a YouTube channel, delivering the latest news using modern technologies and artificial intelligence—guided by a team of experienced senior journalists.
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

అల్పపీడనం వాతావరణం తో రైతుల్లో ఆందోళన

కాకినాడ జిల్లా, తాళ్ళరేవు, విశ్వం వాయిస్: కాకినాడ జిల్లాలో గత వారం రోజుల నుండి అల్పపీడనాలు తుఫాను హెచ్చరికల వాతావరణంతో వారం రోజులుగా కొద్దిపాటి వర్షాలు, రాత్రి సమయంలో విపరీతమైన గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నారుమడులకు సిద్ధమవుతున్న రైతులు కొందరు విత్తనాలు వెదజల్లే సమయంలో వర్షపాతం వల్ల విత్తనాలు మొలకెత్తడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయన్న ఆలోచనలో రైతులు వర్షం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కాలాల మార్పులు వాతావరణ ఇబ్బందుల వల్ల ప్రతిసారి రైతులకు ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. ఈ క్రమంలో కొందరు రైతులు మాట్లాడుతూ విపత్తుల సమయంలో రైతులకు వర్షాల వల్ల తుఫాన్ వల్ల నష్టం సంభవించినప్పుడు ప్రభుత్వం స్పందించి రైతులకు ఇన్సూరెన్స్ సదుపాయాలు కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.

కైట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదివిన పూర్వ విద్యార్థి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఆనందంగా ఉంది.

కాకినాడసిటీ:విశ్వం వాయిస్ న్యూస్ కైట్ ఇంజనీరింగ్ కాలేజీలో 2006 సంవత్సరం విద్యార్థి సరగం శ్రీధర్ ఆయన కైట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఒక అమెరికన్ కంపెనీకి వైస్ చైర్మన్ గా ఉంటూ గడిచిన 19 సంవత్సరాలలో ఎంతో మంది ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించారని అటువంటి వ్యక్తి ఈరోజు కైట్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు తన ఎదుగుదలను వివరించి వారిని కూడా మంచి ప్రయోజకులను చెయ్యాలని ఉద్దేశంతో వారికి ఇంటర్వ్యూలో ఏ విధంగా సమాధానాలు చెప్పాలి అనే దానిపై సుమారు 400 మంది విద్యార్థులకు అవగాహన కల్పించారనీ ప్రస్తుతం శ్రీధర్ సాఫ్ట్వేర్ కంపెనీల అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీగా ప్రభుత్వం తరఫున ఎక్కడైనా ఉద్యోగ...

పేకాట రాయుళ్ల పై జగ్గంపేట పోలీసుల దాడి

జగ్గంపేట :విశ్వం వాయిస్ న్యూస్ కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఎక్కడా క్రికెట్ బెట్టింగులు, కోడిపందాలు ,బొమ్మ బొరుసు, గుండాటలు వంటి ఎటువంటి జూద క్రీడలు జరగటానికి వీలు లేదని జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది .ఆదివారం జగ్గంపేట సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ కు రాబడిన సమాచారం మేరకు జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామ శివారులో జగ్గంపేట ఎస్సై రఘునందన్ రావు మరియు వారి సిబ్బంది పేకాట రాయుళ్లు మీద దాడి చేశారు .ఈ దాడిలో 5 మంది పేకాట రాయుళ్లు నుఅరెస్ట్ చేసి వారి వద్ద నుండి 5100 రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది.ఎవరైనా జగ్గంపేట...

కార్పోరేట్ల కోసమే ఎపి విజన్ -2047

ఆర్.వి.ఎన్. సదస్సు లో వక్తలు వ్యవసాయం, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు తోడ్పాటుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాకినాడ సిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన విజన్ - 2047 డాక్యుమెంట్ కార్పోరేట్ల ప్రయోజనం కోసమే తయారు చేయబడిందని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ డా. బి. గంగారావు తెలిపారు. శనివారం సాయంత్రం కాకినాడ యుటిఎఫ్ హోం లో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో "విజన్ 2047 - ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి" అనే అంశంపై సదస్సు నిర్వహించారు. పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సత్తిరాజు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో గంగారావు ముఖ్యవక్తగా ప్రసంగించారు. 229 పేజీలు గల ఎపి విజన్ డాక్యుమెంట్, కేంద్ర బిజెపి వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా...

కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు

కాకినాడ పాత్రికేయులు వృత్తిధర్మంతో పాటు తమ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని డా.ఓబుల్ రెడ్డి హెల్త్ కేర్&మల్టిస్పెషాలిటి సెంటర్ అధినేత,గుండెవ్యాధి నిపుణులు డా.గజ్జల ఓబుల్ రెడ్డి,జనరల్ సర్జన్ డా.మల్లాడి భార్గవి సూచించారు. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్, కార్యదర్శి మోహన్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సభ్యులు,వారి కుటుంబ సభ్యులకు స్థానిక భానుగుడి వద్దగల జన్మభూమి పార్కు సమీపంలోని హెల్త్ కేర్ సెంటరులో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు.తొలివిడతలో ముందుగా పేర్లు నమోదు చేసుకున్న సుమారు 50మంది పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించి తగిన వైద్య సలహాలతో బాటు అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు.రక్త,షుగర్,బీపీ టెస్ట్, 2డి ఎకో గుండె పరీక్షలు, గుండె...

జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ గుర్తింపు సంస్థ వికాస సౌజన్యంతో జూలై ఐదో తేదీన మెగా జాబ్ మేళా

జగ్గంపేట, విశ్వం వాయిస్ న్యూస్ : జగ్గంపేట నియోజకవర్గం లోని జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, గోకవరం మండలాలలో ఉన్న నిరుద్యోగ యువతకు బంగారు అవకాశం కల్పిస్తూ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ నేతృత్వంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ గుర్తింపు సంస్థ వికాస సౌజన్యంతో జూలై 5వ తేదీ ఉదయం 9 గంటలకు గోకవరం రోడ్డులోని ప్రభుత్వ మోడ్రన్ డిగ్రీ కళాశాలలో ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 1350 ఖాళీలతో అనేక కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగం అవకాశం కల్పించాలని ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్ మేళాలో ప్రతి ఒక్క నిరుద్యోగి ఈ...

క్రియాశీలక సభ్యులకు ఇన్సూరెన్సు చెక్కు లను అందచేసిన జగంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్

జగ్గంపేట :విశ్వం వాయిస్ న్యూస్ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు ఇన్సూరెన్స్ చెక్కులు జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ పంపిణీ చేశారు .ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ వారు ప్రవేశపెట్టిన క్రియాశీలక సభ్యులకు ఇన్సూరెన్స్ చెక్కులు జగ్గంపేట లో అందచేశారు. ఇటీవల జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామానికి చెందిన జన సైనికుడు మృతి చెందడంతో వారి కుటుంబానికి 5 లక్షల చెక్కును,కిర్లంపూడి మండలం పాలెం గ్రామానికి చెందిన జన సైనికుడు పోలిశెట్టి నాగు ఇటీవల ప్రమాదానికి గురైన కారణంగా 50 వేల రూపాయల చెక్కును, జగ్గంపేట మండలం రాజపుడి గ్రామంలో జన సైనికుడు అప్పారావుకు 40వేల రూపాయలు చెక్కుల ను వారి కుటుంబ...

కోరడ సాయిరాం శ్రీనివాస్ (గిల్) మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్లో జగ్గంపేట జట్టు విజయం

టోర్నమెంట్లో 34 టీంలు పాల్గొనగా జగ్గంపేట టీం విన్నర్స్ గా, గుర్రప్పాలెం టీం రన్నర్స్ గా విన్నర్స్ గా నిలిచిన జగ్గంపేట టీంకు షీల్డ్ తో పాటు 25 వేల 5 వందల 55 రూపాయల నగదు బహుమతి   జగ్గంపేట విశ్వం వాయిస్ న్యూస్ కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఈనెల 12వ తేదీన ప్రారంభమైన కోరాడ సాయిరాం శ్రీనివాస్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. ఈ యొక్క టోర్నమెంట్లో 34 టీంలు పాల్గొనగా జగ్గంపేట టీం విన్నర్స్ గా, గుర్రప్పాలెం టీం రన్నర్స్ గా నిలిచారు..ఈ సందర్భంగా గుర్రంపాలెం రోడ్డులోని బాలాజీ రైస్ మిల్ ఎదురుగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ప్రాంగణం వద్ద విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగ్గంపేట టిడిపి మండల...
✅ Message cleared
Left Ad
Right Ad
Logo