విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
ఉద్యోగ భాద్యతలను అంకిత భావంతో పని చేసిన వ్యక్తి మేడవరపు సూర్య భాస్కరరావు అని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు, జగ్గంపేట ఎంపిపి అత్తులూరి నాగబాబు, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ సభ్యులు, మండల టిడిపి అధ్యక్షులు మారిశెట్టి భద్రం అన్నారు. జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయంలో డిప్యూటీ ఎంపిడిఓ గా పని చేసిన సూర్య భాస్కరరావు గురువారం పదవి విరమణ చేశారు. స్థానిక గోకవరం రోడ్డులోని శివ పార్వతి ఫంక్షన్ హాల్ లో జగ్గంపేట ఎంపీడీవో ఏవీఎస్ చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన సన్మాన సభకు పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. 1981 సంవత్సరంలో బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో లైబ్రేరియన్ జాయిన్ అయ్యిన...
జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్, ఐ.పి.ఎస్ మహిళలు మరియు పిల్లల భద్రత విషయమై ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల ప్రకారం గురువారం జగ్గంపేట సర్కిల్ ఆఫీస్ వద్ద కిర్లంపూడి, జగ్గంపేట, గండేపల్లి మండలాల మహిళా సంరక్షణ కార్యదర్శులకు (మహిళా పోలీసులకు) మోటివేషన్ సమావేశాన్ని జగ్గంపేట సీఐ వై .ఆర్.కె శ్రీనివాస్ని ర్వహించారు.ఈ సమావేశంలో జి ఎం కె ఎస్ లు తమ తమ గ్రామాల్లో మహిళలతో ప్రత్యక్షంగా సంప్రదించి ‘శక్తి యాప్’ను డౌన్‌లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వారికి సూచించడంతో పాటు, మహిళల భద్రత కోసం...
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
జగ్గంపేట గ్రామానికి చెందిన డేవిడ్ రాజు (వయసు: 44 సంవత్సరాలు) అనే వ్యక్తి అనుకోని సంఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం ప్రకారం, గత ఆరు సంవత్సరాలుగా జగ్గంపేట పంచాయతీలో స్వీపర్‌గా విధులు నిర్వహిస్తున్న డేవిడ్ రాజు, తేదీ 29.07.2025 (మంగళవారం) సాయంత్రం పంచాయతీ పనులు ముగించుకుని ఇంటికి వెళ్లాడు.
అయితే, తేది 30.07.2025 (బుధవారం) మధ్యాహ్నం సుమారు 12:30 గంటల సమయంలో జగ్గంపేటలోని మంచినీటి చెరువులో ఆయన మృతదేహం కనిపించింది. అనుమానాస్పదంగా కనిపించిన ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న జగ్గంపేట ఎస్ఐ టి. రఘునాథరావు డేవిడ్ రాజు తల్లి ఎల్లె రత్నం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు...
ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, జగ్గంపేట
స్థానిక గోకవరం రోడ్డులోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పెద్దాపురం లలిత ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఆర్థిక సహాయంతో నిర్మించిన ఆర్వో ప్లాంట్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం కెమిస్ట్రీ ల్యాబ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి లలిత ఎంటర్ప్రైజెస్ అధినేతలు మట్టే సత్య ప్రసాద్, మట్టె శ్రీనివాస్, లలిత ఎంటర్ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మట్టి ఆదిశంకర్ హాజరై వాటర్ ప్లాంట్ విద్యార్థినిలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా మట్టే శ్రీనివాస్, ఆదిశంకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గురుకుల పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అడగడం జరిగిందని వెంటనే ఏర్పాటు చేశామని ఇంతమంది పిల్లలు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో...
సామాజిక ఉద్యమకారుడు
పాటంశెట్టి సూర్యచంద్ర
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను మానవత్వంతో అందించాలంటూ సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, మంచానికే పరిమితమైన ప్రతి ఒక్కరికి నెలకు ₹15,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే, తాజాగా సంబంధిత అధికారులు అనేక నిబంధనలు చూపించి అర్హులను నిరాశకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గోకవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద జాయింట్ కలెక్టర్ చినరాముడు కలిసి సమస్యను వివరించిన పాటంశెట్టి సూర్యచంద్ర, 100% దివ్యాంగుడైన గుమ్మల్లదొడ్డి గ్రామానికి చెందిన ఇంజరపు రాంబాబు, మంచానికే పరిమితమైన అచ్యుతాపురం గ్రామస్తులు కోలా శివాజీ, బండారు వెంకటరమణల...
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జగంపేట శాసనసభ్యులు, టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీని ప్రకటించారు. ఈ అభివృద్ధి కమిటీకి చైర్మన్ గా జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, సభ్యులుగా ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్ర రావు, కుంచే రాజా, కందుల చిట్టిబాబు, కోర్పు సాయి తేజ, జంపన సీతారామచంద్ర వర్మ, చదరం గోవిందరాజులు (చంటిబాబు) కంచుమర్తి రాఘవ, హలో నిన్ ప్రశాంత్ కుమార్ (కన్నబాబు), జనపరెడ్డి సుబ్బారావు (కొత్తపల్లి బాబు) బత్తుల సత్తిబాబు తదితరులు నియమించినట్టు ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల ను...
ఆధునిక యంత్రాలతో వ్యవసాయం లాభసాటి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
వ్యవసాయాన్ని లాభసాటి చేయాలని దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 80% రాయితీతో రైతులకు డ్రోన్లు అందిస్తోంది ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే క్యాంప్ లో గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన శ్రీ రామ కిసాన్ డ్రోన్ సిహెచ్ సి రైతు గ్రూపుకు డ్రోన్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏపీలో వ్యవసాయ పెట్టుబడులను తగ్గించడానికి సకాలంలొ పురుగు మందులు మరియు సూక్ష్మ ఎరువులను పంటలకు అందించడానికి వ్యవసాయ డ్రోన్ పరికరాలను వినియోగించేలా సబ్సిడీపై వాటిని ప్రభుత్వం సరఫరా చేస్తుందనివాటితో అన్నదాతలు ఎరువులు, పురుగుమందులు పిచికారీ చేసేలా చర్యలు తీసుకుంటోంది. సాగుకు సాంకేతికతను జోడిస్తే...
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
స్థానిక పద్మనాభ నగర్ లో జగ్గంపేట సచివాలయం 48.6 లక్షలతో నిర్మాణం చేసిన సచివాలయాన్ని బుధవారం ఉదయం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతులు మీదుగా ప్రారంభించారు.ముందుగా నూతన సచివాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే నెహ్రూకు నాయకులు అధికారు లు ఘనస్వాగతం పలికారు. అనంతరం సచివాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జగ్గంపేటలో సచివాలయం మూడు ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఉద్యోగులను సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం పలు గదులను ఎస్ఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్తకొండ బాబు, జీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, సత్తి సదాశివరెడ్డి, పాలచర్ల నాగేంద్ర చౌదరి, వేములకొండ...
హైదరాబాదులో గుర్తించిన గండేపల్లి పోలీసులు
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ జిల్లా వ్యాప్తంగా మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ఉమెన్ మరియు గర్ల్స్ మిస్సింగ్ కేసులకు సంబంధించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో, గండేపల్లి మండలం సింగరంపాలెం గ్రామానికి చెందిన ఒక వివాహిత మహిళ అనామిక ఈ నెల 18వ తేదీన ఇంటి నుండి కనిపించకుండా పోయిన ఘటనపై గండేపల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది.ఎస్పీ ఆదేశాల మేరకు గండేపల్లి ఎస్ఐ శివ నాగబాబు నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందం ఏర్పాటుచేయబడింది. తగిన ఇంటిలిజెన్స్ సేకరణ, సాంకేతిక సహాయంతో అనేక ప్రాంతాల్లో గాలింపు చేపట్టి చివరకు అనామికను...
9 మందికి రూ.90 వేలు జరిమానా
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా, త్రాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ (ఐపీఎస్ )ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కిర్లంపూడి పోలీసు అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, త్రాగి వాహనాలు నడుపుతున్న తొమ్మిది మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.ఈరోజు సంబంధిత తొమ్మిది మందిని గౌరవ పత్తిపాడు కోర్టు ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం గౌరవ న్యాయమూర్తి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున, మొత్తం రూ.90,000 జరిమానా విధించారు.ఈ సందర్భంగా జగ్గంపేట సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ మాట్లాడుతూ త్రాగి వాహనం నడిపితే ప్రాణహాని సంభవిస్తుంది. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై భవిష్యత్తులో మరింత...