08 October 2025
Wednesday, October 8, 2025
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
7 ARTICLES

K Ratna Kishore

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసి కారం తమ్మన్నదొర పేరు పెట్టాలి.

1840లో కారం తమ్మన్నదొర నాయకత్వం లోని బృందం 12 మంది బ్రిటిషు పోలీసులను హతమార్చి..ఈ ఘటన తరువాత 8సంవత్సరాల పాటు తమ్మన్నదొర గెరిల్లా పోరాటం కొనసాగించారని ఈ తరవాత తమ్మన్న అదృశ్యమయ్యారు. విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసి తొలి మన్యం వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు కారం తమ్మన్నదొర పేరు పెట్టాలని ఆదివాసీ మహాసభ ప్రెసిడెంట్ మిడియం వెంకటస్వామి, కుంజం వెంకటరమణమ్మ, న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేసారు.కారం తమ్మన్నదొర, కారుకొండ సుబ్బారెడ్డిల అనుచరుల వివరాలను ప్రభుత్వం వెంటనే సేకరించి ప్రచురించాలని, వారి కుటుంబాలకు తగిన గుర్తింపు ఇవ్వాలని వారు కోరారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో టి.సాయిపుష్ఠ, ముచ్చిక భాస్కర్ కృష్ణంరాజు, దొర, సోమాల దుర్గాప్రసాద్,...

మిథున్ రెడ్డి అరెస్టు అక్రమం..

జక్కంపూడి రాజా దీక్ష భగ్నం దారుణం.. - ఇసుక దోపిడీ ఏ రకంగా చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారు - కూటమి పాలనపై విరుచుకుపడ్డ వైసిపి బిసి నాయకుడు బూడిద శరత్ కుమార్ విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం,విశ్వం వాయిస్ న్యూస్:  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి అరెస్టు అక్రమమని ఆంధ్ర రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సీనియర్ నాయకుడు బూడిద శరత్ కుమార్ విమర్శించారు.ఢిల్లీలోని ఆంధ్ర భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో మద్యం ఏరులై పారుతోందని ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అందుకే మద్యం స్కామ్ పేరుతొ మిథున్ రెడ్డిని అన్యాయంగా అరెస్టు చేసారని విమర్శించారు.ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో నిరసన పెల్లుబికుతోందని, ఇక...

పాస్టర్ ప్రవీణ్ పగడాల బహిరంగ సభ కు అనుమతి ఇచ్చేవరకు వదిలే ప్రసక్తే లేదు

బహిరంగ సభ నిర్వహిస్తే భారీ స్థాయిలో ప్రజలు వస్తారని ప్రవీణ్ పగడాల మృతి హత్యగా ప్రజలు నమ్ముతారని భయంతో బహిరంగ సభ నిర్వహించేందుకు అనుమతి నిరాకరణ - మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్; పాస్టర్ ప్రవీణ్ పగడాల బహిరంగ సభకు అనుమతి ఇచ్చేవరకు వదిలే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ప్రవీణ్ పగడాల కేసు విషయంలో భయపడుతున్నారని అన్నారు. ప్రవీణ్ పగడాల బహిరంగ సభ కోసం ఆరుసార్లు పోలీసులకు అనుమతి కోసం దరఖాస్తు చేసినట్లు...

ఘనంగా చౌడేశ్వరి అమ్మవారి జయంతోత్సవం

రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం, ఉమారామలింగేశ్వర స్వామి కళ్యాణమండపం సంయుక్త ఆధ్వర్యంలో ఆషాఢ బహుళ అమావాస్య పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో..   విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్; రాజమండ్రి జాంపేట శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి కళ్యాణమండపంలో రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం, ఉమారామలింగేశ్వర స్వామి కళ్యాణమండపం సంయుక్త ఆధ్వర్యంలో ఆషాఢ బహుళ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం దేవాంగ కుల దేవత శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి అమ్మ వారి జయంతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆరు గంటల నుండి అమ్మవారి కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుతూ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని గణపతి పూజ,సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు,ఈ సందర్భంగా అమ్మ వారికి పువ్వులు,పండ్లు,పలురకాల మిఠాయిలతో ఆషాఢ సారె,చీరలు...

ఐడి కార్డులు లేకుండా ఎలక్ట్రికల్ పనులు చేస్తే అడ్డుకుంటాం.. 

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రోడ్లు పైకి వచ్చి ఆందోళన నిర్వహిస్తాం..బొజ్జ రామకృష్ణ హెచ్చరిక విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం బొజ్జ రామకృష్ణ హెచ్చరిక రాజమహేంద్రవరం,విశ్వం వాయిస్ న్యూస్: స్థానిక ఎలక్ట్రికల్ వర్కర్స్ పొట్ట కొడుతున్న ఇతర రాష్ట్రాల ఎలక్ట్రికల్ వర్కర్ల ను అడ్డుకోవాలని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ కోరారు. గురువారం రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్యం మైదానంలో ఉన్న విక్రమ హాల్ వద్ద గోదావరి ఎలక్ట్రికల్ యూనియన్ ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ తక్కువ రేట్లకు పనిచేస్తున్న ఎలక్ట్రికల్ కార్మికుల పనులు అడ్డుకునేందుకు స్పెషల్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు.ఈ స్క్వాడ్ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీగా నగర వీధులలో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.ఈ...

పిఠాపురం గెలుపులో పవన్ కళ్యాణ్ విజయ రహస్యం ఏమిటి

చంద్రబాబు గెలుపు సరే,పవన్ కళ్యాణ్ గెలిచారా ! గెలిపించారా ! - ఎన్నికల సంఘం అక్రమాలపై సి బి ఐ/రా సంస్థలతో సంయుక్త ధర్యాప్తుకు ఆదేశించాలి.. విశ్వం వాయిస్ న్యూస్, రాజమండ్రి రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్: పిఠాపురం గెలుపులో పవన్ కళ్యాణ్ విజయ రహస్యం ఏమిటి ! అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ "గాజుగ్లాస్" గుర్తు "రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్" పార్టీ ని మోసం చేసి సాధించుకున్నారని , ఎన్నికల సంఘం పై అధికారిక ఒత్తిడి చేయించి గుర్తు కోసం మేము ముందుగా చేసిన దరఖాస్తును మాయ చేసి అడ్డగోలుగా...

డా.వైఎస్ఆర్ తో మరపురాని జ్ఞాపకాలెన్నో జయంతి సభలో నెమరువేసుకున్న ఉండవల్లి

స్థానిక ప్రకాశం నగర్ రౌండ్ పార్క్ దగ్గర ధర్మంచర హాలుపైన బుక్ బ్యాంకులో మంగళవారం ఉదయం సమావేశం.. విశ్వం వాయిస్ న్యూస్, రాజమండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసినా,మాట్లాడినా అదొక మరపురాని జ్ఞాపకంగా అందరికీ మిగిలిపోతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ అన్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ని పాలించిన సీఎం లలో డాక్టర్ వైఎస్ ని ఎవరూ మర్చిపోలేరని, హ్యూమన్ టచ్ గల సీఎం డా వైఎస్ అని ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతి సందర్బంగా స్థానిక ప్రకాశం నగర్ రౌండ్ పార్క్ దగ్గర ధర్మంచర హాలుపైన బుక్ బ్యాంకులో మంగళవారం ఉదయం సమావేశం నిర్వహించారు. డా వైఎస్ చిత్రపటానికి భక్త్యంజలి ఘటించారు. ఈసందర్బంగా ఉండవల్లి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ తో గల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ చాలామందికి డాక్టర్ వైఎస్ తో మరిచిపోలేని అనుబంధం ఉందన్నారు. అంతటి బలమైన ముద్ర అందరి మనస్సులో డాక్టర్ వైఎస్ వేసుకున్నారన్నారు....
✅ Message cleared
Left Ad
Right Ad
Logo