14 October 2025
Tuesday, October 14, 2025
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
157 ARTICLES

Sk Ansari

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

మాజీ చైర్మన్ ప్రకాష్ పరామర్శ…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండపేట 12 వార్డు లో ఇటీవల మృతి చెందిన బీరక వీర మల్లయ్య కుటుంబ సభ్యుల ను మాజీ మునిసిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ సోమవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలచర్ల బ్రహ్మాజీ, యర్రమాటి సత్యనారయణ, సిరంగి ఈశ్వర్ రావు, దొంత్తం శెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు

డాక్టర్ చల్లా రవికుమార్ కు మాతృవియోగం

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట జనవిజ్ఞాన వేదిక నవ్యాంధ్ర రాష్ట్ర ప్రథమ అధ్యక్షుడు, మండపేట పట్టణానికి చెందిన ప్రముఖ హోమియో వైద్యుడు సామాజిక కార్యకర్త డాక్టర్ చల్లా రవి కుమార్ మాతృమూర్తి లక్ష్మి (81) కన్నుమూశారు. శనివారం రాత్రి 10 గంటలకు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా స్వర్గీయ లక్ష్మి భౌతిక కాయాన్ని సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ జిల్లా కోశాధికారి కామ్రేడ్ కే కృష్ణవేణి, అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు గండి స్వామి ప్రసాద్, లయన్ కురసాల వీర వెంకట సత్యనారాయణ, ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సభ్యులు అద్దేపల్లి వీర్రాజు తదితరులు భౌతిక కాయనికి నివాళులర్పించారు

జిల్లా బిజెపి అధ్యక్షునికి ముస్లిం మైనార్టీల సత్కారం…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండపేట టిడిపి ముస్లిం మైనార్టీ లు జిల్లా బిజెపి అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ను సత్కరించారు.మండపేట లో శనివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా మండపేట కలువపువ్వు సెంటర్ లోని జామియా మస్జిద్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న రాష్ట్ర టిడిపి మైనార్టీ సెల్ కార్యదర్శి సల్మాన్ హుస్సేన్ షాప్ కు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ను మండపేట తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఎండి కరీం ఖాదరి స్వాగతం పలికి దుశాలువతో సత్కరించారు.జాతీయ అధికారిక భాష హిందీ సలహా కమిటీ సభ్యులు షంసు సాదిక్, చాట్రాతి జానకి రాంబాబు లొల్ల,బీజేపీ రాజోలు నియోజకవర్గం కన్వీనర్ అడబాల...

మండపేట లో ఘనంగా హిందీ దివాస్…

హిందీ భాష అభివృద్ధికి కృషి... హిందీ పండిట్ ఫర్జానాకు సత్కారం... విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట జాతీయ భాష హిందీ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని బిజెపి సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ అన్నారు. మండపేట శ్రీ వేగుళ్ళ సూర్యారావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఆదివారం మహబూబ్ హిందీ అకాడమీ ఆధ్వర్యంలో హిందీ దివాస్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి మహబూబ్ హిందీ అకాడమీ చైర్మన్, హిందీ పండిట్ షేక్ ఫర్జానా బేగం అధ్యక్ష వహించారు. ముఖ్య అతిథిలు గా సీనియర్ బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ, ప్రభుత్వ పాఠశాల ఉపాద్యాయులు ఎల్ శ్రీనివాసరావు లు విచ్చేశారు. ఈ సందర్భంగా కోన సత్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం ఇక్కడి విద్యార్థులు అందరికీ హిందీ...

రావి చెట్టు సెంటర్ లో దేవీ నవరాత్రుల రాట ముహూర్తం…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండపేట మున్సిపల్ గ్రంథాలయం వద్ద రావి చెట్టు సెంటర్లో వెలిసిన శ్రీ విజయదుర్గ అమ్మవారి సన్నిధి నందు ఆదివారం ఉదయం దేవీ నవరాత్రుల పందిరి రాట ముహూర్తం చేయడం జరిగింది. రానున్న దేవీ నవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారి భక్తులు భవానీ దీక్ష స్వీకరించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రీ విజయదుర్గ అమ్మవారిని ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలతో అమ్మవారిని అహర్నిశలు కొలుస్తారు.భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవతగా ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

మండపేట లో 49వ రాష్ట్ర స్ధాయి టెన్నికాయిట్ పోటీలు…

విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట క్రీడల్లో రాణించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు అని అంతేకాకుండా క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహద పడతాయని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇండోర్ స్టేడియం లో 49 వ రాష్ట్ర స్ధాయి టెన్నికాయిట్ చాంఫియన్ షిప్ పోటీలు నిర్వహించారు.ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేగుళ్ళ ముఖ్య అతిధిగా పాల్గొని పోటీలు ప్రారంభించారు.చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. క్రీడా జ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్ధులు క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాలన్నారు. క్రీడల్లో రాణించడం...

ఎమ్మెల్యే వేగుళ్ళ పరామర్శలు….

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండపేట పట్టణంలో ఇటీవల మరణించిన పలువురి కుటుంబ సభ్యులను శనివారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పరామర్శించారు. ఇటీవల మరణించిన మండపేట పట్టణం 18వ వార్డులో కోరాడ వీరభద్రరావు, 23వ వార్డులో గోమాడ సత్యవతి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ పరామర్శలలో ఎమ్మెల్యే వెంట జొన్నపల్లి సూర్యరావు, బొడ్డు రామకృష్ణ, పాలచర్ల శిరీష్, రెడ్డి రామకృష్ణ, రెడ్డి సత్యనారాయణ, నరిగిరి బాపయ్య, తదితర్లు ఉన్నారు.

గణేష్ యూత్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట అన్ని దానాలలో అన్నదానం అత్యున్నతం అని రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ మండపేట నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ అన్నారు. గణపతి నవరాత్రి ముగింపు ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని రెండవ వార్డు గొల్లలగుంట వీధిలో గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం భారీ అన్నదాన సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో లీలాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించికుని ప్రసాదాన్ని స్వీకరించారు. ఆ వార్డు కౌన్సిలర్ చిట్టూరి సతీష్, వార్డు ప్రముఖులు నాగులాపల్లి ఈశ్వరరావు, చిట్టూరి గణేష్, కేతా వెంకటరమణ, పెంకే వీరబాబులు అన్నదానం ప్రారంభించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. గణేష్ యూత్ కమిటీ సభ్యులు రాత్రి నుంచే శ్రమించి పలు...

కొవ్వాడ బేబి అప్పన్న బాబు ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట   మండపేట 11వ వార్డ్ లో రేషన్ షాప్ నంబర్ - 6 పరిధిలో ఉన్న రేషన్ లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన క్రొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.11వ వార్డ్ కౌన్సిలర్ కొవ్వాడ బేబి అప్పన్న బాబు పంపిణీ చేశారు. వి ఆర్ ఓ రేషన్ డీలర్, కూటమి నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు.ఈ డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు రావడంతో రేషన్ లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డ్ టీడీపీ అధ్యక్షులు ఆళ్ల వీరబాబు, బి ఎల్ ఏ జనిపల్లి సూరిబాబు, కో బి ఎల్ ఏ వెల్ల నాగేశ్వరరావు, కొల్లాటి ప్రసాద్, పిట్టా రామన్న, బెందల వెంకన్న,...

గూడ్స్ ఆటో యూనియన్ ఆద్వర్యంలో అన్నసమారాధన…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండపేట ఏడిద రోడ్ లో శ్రీ లక్ష్మీ గణపతి గూడ్స్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం అన్న సమాధారాధన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డన చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ మెండు బాపిరాజు,యూనియన్ సభ్యులు లంక జాన్,పిల్లి శివ,వైస్సార్సీపీ నాయకులు వీరబాబు,కిషోర్, కొంకి వీరబాబు,షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
✅ Message cleared
Left Ad
Right Ad
Logo