సమాజ ప్రగతికి అవరోధంగా నిలిచిన క్షయ వ్యాధి పట్ల ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలి...
విశ్వం వాయిస్ న్యూస్, గోకవరం
గోకవరం మండలం జి కొత్తపల్లి గ్రామములో గురువారం ఇంటెన్సిఫైడ్ టీబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆదర్శ ఫార్మసీ కాళాశాలలో పి హెచ్ సి వైద్యాధికారణి నిఖిత మాట్లాడుతూ సమాజ ప్రగతికి అవరోధంగా నిలిచిన క్షయ వ్యాధి పట్ల ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. టీబీ అంతానికి అందరూ భాగస్వామ్యం అవుదామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఎస్టీఎస్ శ్రీనివాస్, సి హెచ్ ఓ శ్రావ్య లు టీబీ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఆర్థిక స్థోమత కలిగిన వారు నిక్షయ్ మిత్ర గా చేరి టిబి వ్యాధిగ్రస్తులను దత్తత...
భారతీయ జనతా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం
రామసేన సంస్థ స్థానిక సంస్థల ఎన్నికలో పోటికి సిద్ధమని ఓ దినపత్తిలో వచ్చిన వార్తను తీవ్రంగా ఖండిస్తున్నాం
రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు
విశ్వం వాయిస్ న్యూస్, గోకవరం
భారతీయ జనతా పార్టీ నాయకులుగా అధిష్టానం నిర్ణయానికి లోబడి తాము ఎప్పుడు పని చేస్తామని, పార్టీ ఆదేశాలను ఎప్పుడు ధిక్కరించలేదని, విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అన్నారు. రామసేన సంస్థ నుంచి స్థానిక ఎన్నికలకు సిద్ధమని ఓ దినపత్రికలో వచ్చిన వార్తను ఆయన ఖండించారు. దీనిపై స్థానిక తంటికొండ రోడ్డులోని సీఎండీ లే అవుట్ వద్ద గురువారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మా...
గంగాలమ్మ అమ్మవారి అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న కంబాల
విశ్వం వాయిస్ న్యూస్, గోకవరం
గోకవరం మండలం రంపయర్రం పాలెం గ్రామంలోని శ్రీ గంగాలమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు పురస్కరించుకుని, గురువారం నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమంలో విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. తొలిత ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ఘన స్వాగతం పలికి, పూలమాలతో సత్కరించారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని, భక్తులకు తీర్థ ప్రసాదాలు వట్టించారు. జాతర ఉత్సవాలకు, అన్న సమారాధన కార్యక్రమానికి కంబాల శ్రీనివాసరావు రెండు లక్షలు రూపాయలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి నిరంతర కృషి చేస్తానన్నారు. మన సాంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరు పరిరక్షించుకోవాలని...