21 October 2025
Tuesday, October 21, 2025
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
64 ARTICLES

S Praveen

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

పేకాట శిబిరంపై కోరింగ పోలీసులు మెరుపు దాడులు 

పేకాట శిబిరంపై కోరింగ పోలీసులు మెరుపు దాడులు విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, తాళ్ళరేవు కాకినాడ జిల్లా ఎస్పీజి బిందు మాధవ్ ఐపీఎస్ కు అందిన సమాచారం మేరకుఎస్పీ ఆదేశాలతో కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సర్కిల్ పరిధిలోని కోరింగ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి సత్యనారాయణ సిబ్బందితో పేకాట శిబిరంపై ఆకస్మిక దాడి చేశారు. దాడిలో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 27600 నగదు, ఏడు సెల్ ఫోన్లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితులు సుంకరపాలెం ఇంజరం తాళ్ళరేవుయానాం పరిసర ప్రాంతాలకు చెందినవారు. తాళ్ళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో ఆర్ఆర్ ఇన్ హోటల్ పై కోరంగి ఎస్ఐ పి సత్యనారాయణ దాడి చేయగాహోటల్ ను...

జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీ 

జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీ విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, తాళ్ళరేవు కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండల పరిధిలోని సుబ్బారాయుడు దిమ్మ వద్ద ఆదివారం రాత్రి రెండుద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న కాట్రేనికోన మండలానికి చెందిన మరియుతాళ్ళరేవు మండలానికి చెందిన వ్యక్తులకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి స్థానిక కోరింగ ఎస్సై పి సత్యనారాయణ మరియు సిబ్బందితో కలిసి హటాహుటిన చేరుకుని ప్రమాదంలో గాయపడ్డ వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

334 గుర్తింపు లేని రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించిన ఎన్నికల కమిషన్

334 గుర్తింపు లేని రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించిన ఎన్నికల కమిషన్ విశ్వం వాయిస్ స్పెషల్ రిపోర్ట్ టీం, ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ *334 గుర్తింపు లేని రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించిన ఎన్నికల కమిషన్*   ▪️దేశంలో మొత్తం 2854 రిజిస్టర్ అయ్యి.. గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ▪️వీటిలో 334 పార్టీలు వరుసగా 6 సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో డీ-లిస్ట్ అయ్యాయి. ▪️ఇప్పుడు మిగిలినవి 2520 మాత్రమే. *తొలగించడానికి కారణాలు* ▪️6 సంవత్సరాలు పోటీ చేయలేదు. ▪️చిరునామా, పదవిదారుల వివరాలు అప్‌డేట్ చేయలేదు. ▪️ECI నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. *డీ-లిస్ట్ అయిన పార్టీలకు ఇకపై* ▪️పన్ను మినహాయింపు లభించదు. ▪️ఎన్నికల గుర్తు రిజర్వేషన్ ప్రయోజనాలు ఉండవు.

అక్కాచెల్లెళ్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాఖీ పండుగ శుభాకాంక్షలు

అక్కాచెల్లెళ్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాఖీ పండుగ శుభాకాంక్షలు విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగింటి ఆడపడుచులకు సీఎం చంద్రబాబు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 'అన్నా చెల్లెళ్ల అనుబంధానికి శుభసందర్భమే రాఖీ పర్వదినం. మీ కోసం నేనున్నాను. రాఖీ పౌర్ణమి మనందరికి ప్రత్యేకం. మీ అందరికి ఒక అన్నగా మీకు రక్షణ కల్పించే, మీ జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత నాది. ఆడబిడ్డల బాగుకోసం అహర్నిశలూ పని చేస్తా.' అంటూ ట్వీట్ చేశారు.

ఏపీలో కొత్త రైల్వే లైను నిర్మాణానికి ప్రతిపాదనలు 

ఏపీలో కొత్త రైల్వే లైను నిర్మాణానికి ప్రతిపాదనలు విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, అమరావతి, విజయవాడ *ఏపీలో కొత్త రైల్వేలైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు.* మొత్తం 1,336 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ల నిర్మాణం. రూ.2,982 కోట్ల వ్యయమవుతుందని అంచనా. భద్రాచలం-కొవ్వూరు 70 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ల నిర్మాణం. ముద్దనూరు-పులివెందుల-ముదిగుబ్బ-శ్రీసత్యసాయి 105 కిలోమీటర్లు. అట్టిపట్లు-పుత్తూరు 30 కిలోమీటర్లు, 205 కిలోమీటర్ల మేర కొత్త లైన్లు.

రాష్ట్రంలో బహుళ అంతస్తుల భవనాలకు 72 గంటల్లో పర్మిషన్ !

రాష్ట్రంలో బహుళ అంతస్తుల భవనాలకు 72 గంటల్లో పర్మిషన్ ! విశ్వం వాయిస్ స్పెషల్ రిపోర్ట్ టీం, విజయవాడ ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణాల అనుమతుల్ని ప్రభుత్వం తేలిక చేస్తోంది. ఇప్పటికే ఐదు అంతస్తుల వరకూ సెల్ఫ్ డిక్లరేషన్ తో ఆన్ లైన్ లోనే అనుమతులు తీసుకునే అవకాశం కల్పించింది. ఇప్పుడు బహుళ అంతస్తుల నిర్మాణాల అనుమతుల్ని కూడా సులభతరం చేస్తోంది. పట్టణాభివృద్ధిని వేగవంతం చేయడానికి , “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”ను ప్రోత్సహించడానికి బహుళ అంతస్తుల భవనాలకు 72 గంటల్లో అనుమతులు ఇవ్వడానికి కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను ప్రవేశపెట్టింది. ఈ విధానం 12 అంతస్తులు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న భవనాల నిర్మాణ అనుమతులను 72 గంటల్లో జారీ చేయడానికి ఉపయోగపడుతుంది. నెలల తరబడి జాప్యం అయ్యే అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది.మంగళగిరిలోని డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కార్యాలయంలో...

ప్రపంచ ఆదివాసిదినోత్సవo లో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ప్రపంచ ఆదివాసిదినోత్సవo లో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి :నారా చంద్రబాబు నాయుడు విశ్వం వాయిస్ స్పెషల్ రిపోర్ట్ టీం, అల్లూరి సీతారామరాజు జిల్లా:పాడేరు, వంజంగి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పాడేరు మండలం వంజంగి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వనదేవత మోదకొండమ్మను దర్శించుకున్నారు. గ్రామంలోని కాఫీ తోటలను పరిశీలించిన సీఎం వారితో మాట్లాడారు. ప్రజావేదిక వద్ద గిరిజన ప్రాంతంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

గర్భిణీ స్త్రీలకు పోషకాహారం పంపిణీ చేసిన : డాక్టర్ పుల్లా ప్రసాద్ 

గర్భిణీ స్త్రీలకు పోషకాహారం పంపిణీ చేసిన : డాక్టర్ పుల్లా ప్రసాద్ విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్, కరప కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం లోని కరప మండలం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో శనివారం గర్భిణీ స్త్రీలకు మౌర్యా హాస్పిటల్ డాక్టర్ పుల్లాప్రసాద్ ఆధ్వర్యంలో పౌష్టిక ఆహారం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గర్భిణీ స్త్రీలకు ఈ సమయంలో పౌష్టికాహారం అవసరమని, మా వంతు సహాయంగా గర్భిణీ స్త్రీలకు పండ్లు, రొట్టెలు, పౌష్టికాలతో కూడిన ఆహారము అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కడప మెడికల్ ఆఫీసర్ అఫ్రోజ్, యేసు రత్నం, మంగా పరమేష్, పోలిశెట్టి తాతీలు, పేపకాయల తణుకు రాజు, మంచాల శ్రీను, నారాయణమ్మ, సీత తదితరులు పాల్గొన్నారు.

శ్యామ్ కు”చేయూత రవి అభినందనలు. 

శ్యామ్ఇన్స్టిట్యూట్ అధినేత కు"చేయూత రవి అభినందనలు. విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడసిటీ ఇటీవల విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో 75 శాతం పైగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఉత్తీర్ణులు కావడంతో శ్యామ్ ఇనిస్టిట్యూషన్స్ కొత్త రికార్డ్ సృష్టించిందని చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మొండి రవికుమార్ అన్నారు . శ్యామ్ ఇన్స్టట్యూట్ లో అధినేత శ్యామ్ ను ప్రత్యేకంగా శాలువా కప్పి ప్రశంసించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ఎన్నో వేల కుటుంబాలకు జీవనోపాధి కల్పించడంలో శ్యామ్ చూపిస్తున్న శ్రద్ధ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో అత్యధికంగా ఉత్తీర్ణత పొందడం తద్వారా కాకినాడ జిల్లాకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. శ్యామ్ మాట్లాడుతూ సివిల్ విభాగంలో 2590 ఏపీఎస్పీ...

952వ రోజు అభాగ్యులకు అన్నదానం 

952వ రోజు అభాగ్యులకు అన్నదానం విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, తాళ్ళరేవు కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలంలోని తాళ్ళరేవు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం అభాగ్యులకు అన్నదానం కార్యక్రమం ద్వారా భోజనాలు అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు తాళ్ళరేవు రీజియన్ చైర్ పర్సన్ బిళ్ళకుర్తి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సోమవారం నాటికి 952 రోజులునుండి నిరంతరాయంగా అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం దాతలు ఏర్పాటుచేసిన భోజనాలను మండలంలోని పలువురు అభాగ్యులకు అందజేశారు. చాలా రోజులుగా లయన్స్ క్లబ్ చేస్తున్న ఈ సేవలను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో దాతలు మరియు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
✅ Message cleared
Left Ad
Right Ad
Logo