మొదటి రోజు 5 గురు గైర్హాజరు..
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
రెండేళ్ల విరామం తర్వాత పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో బుధవారం ప్రారంభ మయ్యాయి. గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా పదవ తరగతి పరీక్షలు జరగని పరిస్థితి తెలిసిందే. కాగా ఈ ఏడాది ప్రత్యక్షంగా పరీక్షలకు విద్యార్థులు హజరవు తుండగా మొదటి రోజు విద్యార్థులు కొంత భయంతో హాజరయ్యారు. ఉదయం 9.45 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షల సమయం కాగా విద్యార్థులు ఉదయం 9 గంటల లోపే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. రాయవరం మండల పరిధిలో మండల కేంద్రమైన రాయవరం లో శ్రీ రామయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, భాష్యం స్కూల్, చెల్లూరు, పసలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు పరీక్షలు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి విద్యార్థులు పలు ఆలయాలతో ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి పరీక్ష కేంద్రాలకు తరలివెళ్లారు. రాయవరం జిల్లా పరిషత్ హైస్కులో ఓ విధ్యార్దినికి కాలికి గాయం కావడంతో నడవలేని స్తితిలో వుండగా తన బందువు ఆ విదార్ధిని ఎత్తుకుని పరీక్షా కేంద్రానికి తీసుకుని వెళ్ళారు. తమ పిల్లలు పరీక్షలు రాయడంతో తల్లిదండ్రులు వారి వెంట వచ్చి వారికి ధైర్యం నింపారు. మండలం లో పదో తరగతి పరీక్షలకు 641 మంది విద్యార్థులకు గాను బుదవారం 636 విద్యార్థులు హాజరయ్యారు. 5 గురు గైర్హాజరయ్యారని మండల విద్యాశాఖ అధికారి కే తాతారావు తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసు సిబ్బందిని, ఫస్ట్ ఎయిడ్ సదుపాయాలను ఏర్పాటు చేసి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.