సమీక్ష…..
జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ సిటీ న్యూస్: రాజమహేంద్రవరం నగర పరిధిలో రైల్వే హావ్ లాక్ బ్రిడ్జి (మొదటి వంతెన), ఇతర భూసంబంధ అంశాలపై చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు.
బుధవారం స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయంలో రైల్వే సంబందించిన అంశాలపై కమిషనర్ కె. దినేష్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా.మాధవీలత మాట్లాడుతూ, రైల్వే కి సంబందించిన ఆస్తుల బదలాయింపు ప్రక్రియ , ఇతర భూముల కేటాయింపు అంశాలపై సమగ్రమైన అవగాహన కి రావడం జరిగిందన్నారు. ఈరోజు చర్చించిన అంశాలపై రైల్వే ఉన్నత అధికారులతో ప్రత్యుత్తరాలు జరపాలని కలెక్టర్ ఆదేశించారు. రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి ఐదు బళ్ళ మార్కెట్ ప్రాంత వరకు ఆక్రమణ లపై ఈరోజే జాయింట్ ఇన్స్పెక్షన్ చెయ్యాలని కలెక్టర్ స్పష్టం చేశారు. 1.5 కిలో మీటర్ల పరిధిలో రహదారి మార్గం వెడల్పు అంశాలపై చర్చించారు. ప్రజా ప్రయోజనార్థం నగరపాలక సంస్థ ద్వారా వివిధ అభివృద్ధి పనులు చేపట్టవలసి ఉన్న దృష్ట్యా సంబంధించి అంశాలను దృష్టిలో పెట్టుకొవాల్సి ఉందన్నారు. ఇరువురి కి ఆమోద యోగ్యమైన విధానం లో ప్రతిపాదనలు ఉండాల్సి ఉందన్నారు.
ఈ సమావేశంలో రైల్వే సీనియర్ డివిజనల్ ఇంజనీర్ యూ. అక్కిరెడ్డి, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, రెవెన్యూ, నగరపాలక సంస్థ, రైల్వే అధికారులు పాల్గొన్నారు.