విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, బిక్కవోలు:
రంగాపురం సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం స్విచ్ రీప్లేస్మెంట్ మెయింటినెన్స్ నిమిత్తం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుందని బిక్కవోలు ఏఈ కె.బుజ్జి దొర గురువారం సాయంత్రం స్థానిక విలేకరులకు తెలిపారు. ఏఈ తెలిపిన వివరాల ప్రకారం మండలంలో బిక్కవోలు 33/11 కె.వి రంగాపురం సబ్ స్టేషన్ లో 11 కె.వి33 కె.వి ఏబి స్విచ్ రీప్లేస్మెంట్ మరమ్మత్తు నిమిత్తం రంగాపురం ఎస్ ఎస్ పరిధిలో అన్ని గ్రామాలకు రంగాపురం, ఇల్లపల్లి పాకలు , తుమ్మలల్లి గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు బిక్కవోలు ఏఇ కె. బుజ్జి దొర తెలిపారు. ఈ విద్యుత్తు అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.