గంగా భావాన్ని ఉద్యోగం నుండి తొలగించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి..
సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలు కె బేబీ రాణి డిమాండ్..
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
అంగన్వాడి కార్యకర్త గంగా భవాని పై భౌతిక దాడి తెగబడుతున్న రాజకీయ నాయకులపై చర్యలు చేపట్టాలని సిఐటియు యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కే బేబీ రాణి డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన రాయవరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఊలపల్లి సెక్టార్ పరిధిలోని కొమరిపాలెం గ్రామంలో అంగన్వాడి సెంటర్ లో కార్యకర్తగా పనిచేస్తున్ననడిపిల్లి గంగాభవాని పై ప్రజా ప్రతినిధి భర్త దాడి చేసిన ఇప్పటివరకు ఆ వ్యక్తిపై ఎటువంటి కేసు నమోదు చేయకపోవడంతో పాటు భవాని ఉద్యోగం నుండి తొలగించిన కారణంగా సోమవారం రాయవరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిఐటియు అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె బేబీ రాణి పాల్గొని మాట్లాడుతూ అంగన్వాడి కార్యకర్తగా పనిచేస్తున్న గంగా భవానిపై బిక్కవోలు ఎంపీపీ భర్త కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి దాడి చేసి, అధికారులకు సొమ్ములు ముట్టజెప్పి ఆమెను విధుల నుంచి తొలగించేలాగా చేశారని, దానికి కారణమైన సత్తిబాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలపై భౌతిక దాడులకు తెగబడుతున్న రాజకీయ నాయకులు పై చట్టపరమైన చర్యలు చేపట్టకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి వెనుకాడబోమని హెచ్చరించారు. భవాని ని విధుల నుంచి తొలగించడంలో అధికారులు బాధితురాలు తరుపున నిలబడకుండా ప్రజా ప్రతినిధులకు వత్తాసు పలుకుతున్నా రాయవరం ప్రాజెక్ట్ సిడిపిఓ ను, సూపర్వైజర్ లను వెంటనే ఉద్యోగం నుండి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. గంగాభవానిని విధుల్లోకి తీసుకునే వరకు రాయవరం ఐసిడిఎస్ కార్యాలయం వద్ద ధర్నా కొనసాగిస్తూనే ఉంటుందని ఆమె తెలిపారు. రాజకీయ వేధింపులలో తొలగించిన అంగన్వాడి వర్కర భవాని ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, తొలగించిన నాటి నుండి నేటి వరకు వేతనం వెంటనే చెల్లించాలి, రాజకీయ వ్యక్తులకు లొంగిపోయిన అధికారులను బదిలీ చేయాలి, అంగన్వాడీ కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆమె తదితర డిమాండ్లను మీడియా దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో రాజానగరం ప్రాజెక్టు కార్యదర్శి కే బేబీ రాణి, కోరుకొండ ప్రాజెక్ట్ అధ్యక్షులు సిహెచ్ అన్నపూర్ణ, రంగంపేట ప్రాజెక్ట్ కార్యదర్శి బి మార్తమ్మ, రాయవరం ప్రాజెక్టు గౌర అధ్యక్షులు ఎన్ బలరాం, రంగంపేట ప్రాజెక్ట్ అధ్యక్షులు ఎన్ దుర్గాంబ,డివిజన్ ప్రధాన కార్యదర్శి డి ఆదిలక్ష్మి, మండల అధ్యక్షురాలు ఎస్. కృష్ణకుమారి, ప్రాజెక్టు పరిధిలో రామచంద్రపురం, రాయవరం, బిక్కవోలు, అనపర్తి మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ పాల్గొన్నారు