విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా సమగ్ర శిక్ష అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పిల్లి రాంబాబు పేర్కొన్నారు.
మండలంలోని శనివారం వెదురుపాక జెబి మెయిన్ ప్రాథమిక పాఠశాలను, రాయవరం వేలంపేట పాఠశాలను సమగ్ర శిక్ష అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పిల్లి రాంబాబు సందర్శించారు. ఈ సందర్భంగా అయన పాఠశాలలో రికార్డులను పరిశీలించి రికార్డులను అప్డేట్ గా ఉంచుకోవాల్సిందిగా స్కూలు సిబ్బంది కి ఆదేశించారు. విద్యార్థుల విద్యా స్థాయిని పరిశీలించి వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా పాఠశాల హెచ్ ఎం లకు ఎల్ వెంకటరమణ, జె సత్యవేణి, భారతిలకు సూచించారు.