విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
ఓ గృహిణి తన పిల్లలను తీసుకుని ఇంటిలో నుండి వెళ్లిపోయిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి వి ఎస్ ఎస్ ఎన్ సురేష్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన సత్తి వెంకటరెడ్డి ఆయన భార్య సత్తి వీరభవాని (31) వీరిరువురు కొన్ని రోజుల నుండి ఒకరినొకరు మాట మాట అనుకుని గొడవ పెట్టుకుని యున్నారు. ఈనెల 23వ తేదీన ఉదయం పది గంటలకు వీర భవాని భర్త లేని సమయంలో తన ఇద్దరు మగ పిల్లలను తీసుకుని ఇంటి నుండి వెళ్లిపోయినట్లు చుట్టుపక్కల, బంధువుల గాలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఏమీ చేయని దిక్కు తోచని స్థితిలో శనివారం సాయంత్రం రాయవరం పోలీసులను ఆశ్రయించారు. భర్త సత్తి వెంకటరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు.