విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
మహిళా సర్పంచ్ పై కొందరు వ్యక్తులు దుర్భాషలాడిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శనివారం ఎస్సై పి వి ఎస్ ఎస్ ఎన్ సురేష్ తెలిపారు. మండలంలో కూరకాళ్లపల్లి గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ పిల్లి శారద ఈనెల 23 వ తారీఖున మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రం వద్ద గర్భిణీలకు స్త్రీలకు, పిల్లలకు పోషకాహారం కిడ్స్ పంపిణీ చేయుటకు అంగన్వాడి సూపర్వైజర్ సర్పంచు ను పిలవగా శారద వెళ్లినట్లు అక్కడ కొంతమంది వ్యక్తులు ఆమెను బండబూతులు తిట్టి భయభ్రాంతులకు గురిచేసినట్లు సర్పంచ్ శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.