విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండల పరిధిలోని ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లను ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ శాఖ అధికారులు బిగించారు. విద్యుత్ శాఖ జేఈ నాగరాజు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల వల్ల ఎంత విద్యుత్ వినియోగం అవుతుంది, ఎంత బిల్లు రీడింగ్, ఓవర్ లోడ్ వంటి వివరాలు స్మార్ట్ మీటర్లు సులువుగా తెలియపరుస్తాయని అన్నారు. ఈ స్మార్ట్ మీటర్లు మొబైల్ ఫోన్ రీఛార్జ్ లాగా విద్యుత్ రీఛార్జ్ చేసుకునే విలుసుబాటు ఉంటుందని, త్వరలో అన్ని గృహాలకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామని, సోలార్ విద్యుత్తు ఉన్న గృహాలకు కూడా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎఇ టీవివి సత్యనారాయణ, అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు