విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాపీలేశ్వరపురం:
కపిలేశ్వరపురం, విశ్వం వాయిస్ న్యూస్: కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరా స్వామీ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం వైభవంగ నిర్వహించారు. ఈ నెల 19 వ తేదీ నుండి స్వామి వారి ఆలయం వద్ద హోమాలు, విశిష్ట పూజలు నిర్వహించారు.22 వ తేది న స్వామి వారి ని గ్రామ వీధులు గుండా ఊరేగించారు.ఆదివారం ఆలయ0 వద్ద యజ్ఞ, హోమాలు,శాంతి కళ్యాణము వంటి విశేష పూజలు నిర్విహించి, శ్రీ భూదేవీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగ నిర్వహించారు. నూతన ఆలయ0 ప్రారంభం సందర్భంగా టేకి గ్రామ ఆడపడుచులు తమ గ్రామాలు నుండి వచ్చి,స్వామి వారికి బూరెలు సమర్పించారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనకు గ్రామస్తులు, ఆలయ కమిటీ వారు ఘనంగా స్వాగతం పలికారు. సంధర్భంగా భారీ ఎత్తున జరిగిన అన్నసమారాధన లో వేలదిగా భక్తుల అన్నప్రసాద0 స్వీకరించారు. టేకి దాని పరిసర ప్రాంతాల నుండి వేలాది భక్తులు తరలివచ్చి ఈ బృహుత్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.