Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పార్టీలు మరేపరిస్తితులు వచ్చాయి…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

పదవుల కోసం పార్టీలు మారలేదు..
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

 

మండపేట, విశ్వం వాయిస్ న్యూస్,:
పార్టీలు మారే పరిస్థితులు వచ్చాయి కాని నాకు నేనుగా పదవులు కోసం పార్టీలు మారలేదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. అధికారమే పరమావదిగా తోట త్రిమూర్తులు పార్టీలు మారతాడని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆరోపణను ఎమ్మెల్సీ తోటత్రిమూర్తులు
వైసిపి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఖండించారు.1994 వ,సంవత్సరంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన తాను అప్పటి సీఎం ఎన్ టి ఆర్ ని దింపి చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాతనే ఆయన కోరిక పై టీడీపీ కి మద్దతు పలికానన్నారు. 2004 వ సంవత్సరంలో జరిగిన జనరల్ ఎన్నికలు లో 2 వ, సారి టీడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడి, టీడీపీ ఇంఛార్జిగా ప్రతిపక్ష పాత్ర పోషించానని తోట తెలిపారు. రామచంద్రపురం టిడిపి ఇంఛార్జిగా తాను ఉండగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రాబునాయుడు తో రెండు సార్లు నియోజకవర్గం కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తోట త్రిమూర్తులు అన్నారు. 2008 లో తాను టిడిపి లో ఉండగా తనను సంప్రదించకుండా జిల్లాకు మీ కోసం యాత్ర కు వచ్చిన చంద్రబాబునాయుడు పార్టి టికెట్ హామీపై మరో వ్యక్తిని టీడీపీ లో చేర్చుకున్నాడని తోట పేర్కొన్నారు. 2009 లో పీ ఆర్ పి అభ్యర్థిగా పోటీ చేసిన తాను ఓటమి చెందినా పార్టీ ని విడవలేదని తోట వివరించారు. అనంతర జరిగిన పరిణామాలులో పి ఆర్ పి ని అధికార కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేసిన తరవాత 2012 లో జరిగిన బైఎలక్షన్స్ లో రామచంద్రపురం నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి విజయం సాధించానని తోట త్రిమూర్తులు అన్నారు. 2014 లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం ను అడ్డగోలుగా విభజించిన అనంతరం ఆంధ్రరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జీరో అయిందన్నారు. నవీన ఆంద్రప్రదేశ్ కు పాలనా అనుభవజ్ఞులు అయిన నారా చంద్రబాబు నాయుడు సీఎం అయితే రాష్ట్రం బాగుంటుందని నాతో బాటు ఎందరో కాంగ్రెస్ లో మంత్రి పదవులు అనుభవించిన నాయుకులు టీడీపీ లో చేరడం జరిగిందని తోట త్రిమూర్తులు తెలిపారు. అయితే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన చంద్రబాబు నాయుడుకు ఓటమి తప్పదు అని సర్వేలు వెల్లడిస్తున్నా తాను 2019 లో టీడీపీ అభ్యర్థిగా నే పోటీ చేసి ఓటమి చెందానని తోట త్రిమూర్తులు అన్నారు. ఆంధ్ర రాష్ట్రం లో టిడిపిని మొత్తం స్వీప్ చేసి, జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో వైసిపి 151 అసెంబ్లీ స్థానాలు సాధించి0ది.ఎన్నికలు అయిదు సంవత్సరాలు ఉండగానే తన సేవలు అధికార వైసీపీ కి అవసరం అని సీఎం జగన్ మోహన్ రెడ్డి తలంచి, తనను పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందని ఎమ్ ఎల్ సీ తోట త్రిమూర్తులు వివరించారు. అనంతరం తనకు మండపేట నియోజవర్గ భాద్యతలు అప్పగించి, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి కి జీవితాంతం రుణపడి ఉంటానని తోట త్రిమూర్తులు అన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement