ప్రారంభించిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:
పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)
పోతవరం కోకోనట్ కల్యాణ మండపంలో జరిగిన పి గన్నవరం మండలం డ్వాక్రా సంఘాలకు 2021-2022 సంవత్సరానికి గాను వైఎస్సార్ సున్నా వడ్డీ పంపిణీ కార్యక్రమాన్ని
పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా ప్రతి సంవత్సరం డ్వాక్రా మహిళలు ఆదుకునే కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరానికి గాను 1695 సంఘాల గాను 1కోటి 38లక్షల 2 వేల రూపాయలు డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి జమ అవుతుందని తెలియజేశారు.అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికిడ్వాక్రా మహిళా.ప్రజాప్రతినిధులు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో.మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి ఐ.ఇ. కుమార్ ఎపిఎం వరాలబాబు వైయస్సార్ పార్టీ మండల అధ్యక్షులు నక్కావెంకటేశ్వర్రావు.దొమ్మేటి దుర్గారావు మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు తోలేటి బంగారునాయుడు సర్పంచులు కుసుమే చంద్రకళావెంకటేశ్వరరావు వడలి కొండయ్య వెంగమాంబ.శృంగవరపు లక్ష్మణరావు.కొంబత్తుల ఏసు.రాష్ట్ర వైఎస్సార్ పార్టీ సంయుక్త కార్యదర్శి అడ్డగళ్ళ వెంకటసాయిరామ్ కొక్కిరి రవికుమార్.కుంపట్ల గోపీ.ఎంపిటిసి సభ్యులు డ్వాక్రా యానిమేటర్లు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు