దగ్ధం చేసిన సిపిఎం,సిపిఐ నాయకులు"""
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం( విశ్వం వాయిస్)
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం చేయాలని వామపక్ష పార్టీలు పిలుపులో భాగంగాఅమలాపురం స్థానిక గడియారస్ధంభం సెంటర్ లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ను దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు సిపిఐ పార్టీ కోనసీమ జిల్లా కార్యదర్శి కే సత్తిబాబు మాట్లాడుతూ దేశంలో నిత్యావసర వస్తువులు పెట్రోలియం ఉత్పత్తులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ప్రజలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెయ్యి రెట్లు భారాలు మోపుతున్నారని పెట్రోలియం ఉత్పత్తులపై 20 21 -22 సంవత్సరాల కాలంలో నాలుగు లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ప్రజల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ గుంజుకున్నా యని బడా కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ప్రజలపై విపరీతమైన భారాలు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
సెజ్ సర్చార్జీలు తగ్గించి ఎక్సైజ్ సుంకాల తగ్గించి ప్రజలకు పన్నుల భారాల నుండి విముక్తి కలిగించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెట్రోల్ 123 పాయలు డీజిల్ 106 రూపాయలు పెరిగాయని వంట నూనె 200 రూపాయలు దాటిందని కూరగాయలు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని తక్షణం వాటిని నియంత్రించే పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు బారాలు తట్టుకోలేక విలవిల్లాడుతూ ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై 4,300 కోట్ల రూపాయల భారం మోపిందని ఆర్టీసీ బస్సు చార్జీల పేరుతో మరో 1000 కోట్ల రూపాయల భారం మోపారని తక్షణం వాటిని తగ్గించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మోడీ కార్పోరేట్ కంపెనీల ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారని వేలకోట్లు బ్యాంకు రుణాలు ఎగవేతదారులకు కేంద్రప్రభుత్వం అండగా నిలుస్తుందని సామాన్యప్రజల నిత్యావసరాల ధరలను కంట్రోల్ చేయకపోవడం సిగ్గుచేటన్నారు మందులు ధరలు 30%పెంచిందని ఆవేదన వ్యక్తం చేసారు రాష్ట్ర ప్రభుత్వం మోడీ విదానాలను రాష్ట్రం లో అమలుచేయడానికి ఆతృతపడుతుందని జగన్ కేసులకోసం ఆంద్రరాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేకహోదా హమీలపై పోరాడకుండా రాజీపడుతున్నారని ఎద్దేవా చేసారు కేరళా రాష్ట్రం లాగా రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ లపై రాష్ట్రాలు విదించే పన్నలు తగ్గించాలని డిమాండ్ చేసారు రాబోవు కాలంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం అంద్రరాష్ట్ర ప్రజలుచెబుతారని అన్నారు ఈ భారాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తిరగ బడాలని పోరాడాలని పిలుపు నిచ్చారు
ఈకార్యక్రమంలో సిపిఐ సిపిఎం పార్టీల కార్యకర్తలు కారెం వెంకటేశ్వరరావు కే సత్తిబాబు పి వసంత్ కుమార్ అడపా సత్యనారాయణ కుడిపూడి రాఘవమ్మ కే శంకర్ కామిరెడ్డి చంద్రరావు కుడుపూడి సత్తిబాబు ఊటాల వెంకటేష్ కాళ్ళ భీమరాజు ఉగ్గిరాల సబ్రమణ్యం సురేష్ అయితాబత్తుల సుబ్బారావు నిమ్మకాయల సురేష్ కుడిపూడి తాతాజి ఇళ్ళ రామచంద్రరావు శీపతి శ్రీనివాసరావు సంపర రాము పితాని ఆనంద రావుకుడిపూడి సత్యనారాయణ, ఉగ్గిరాల సురేష్ కుడిపూడి సింహాద్రి, మట్టపర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు